క్రీడాభూమి

వెంటాడుతున్న వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఆగస్టు 23: న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రెండు రోజు ఆటను కూడా వర్షం వెంటాడింది. మొదటి రోజున 36.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యంకాగా, శ్రీలంక రెండు వికెట్లకు 85 పరుగులు చేసిన విషయం తెలిసిందే. రెండో రోజు ఉదయం ఆటను ఉదయం 9.45 గంటలకు ప్రారంభించాలని అనుకున్నప్పటికీ, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆలస్యమై, 10.25 గంటలకు మొదలైంది. జట్టును ఆదుకునే బాధ్యత తనపై ఉన్నప్పటికీ, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో బంతిని నిర్లక్ష్యంగా ఆడిన ఏంజెలో మాథ్యూస్ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరవద్ద ఔటయ్యాడు. అదే ఓవర్‌లో కుశాల్ పెరెరా (0) వికెట్ కూడా కూలింది. అతను ఎల్‌బీగా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కరుణరత్నే 165 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లతో 65 పరుగులు చేసి, టిమ్ సౌథీ బౌలింగ్‌లో బీజే వాల్టింగ్‌కు చిక్కాడు. 130 పరుగుల వద్ద శ్రీలంక ఐదో వికెట్ చేజార్చుకుంది. నిరోషన్ డిక్‌విల్లా మూడు బంతులు ఎదుర్కొని, పరుగుల ఖాతా తెరవకుండానే, టిమ్ సౌథీ బౌలింగ్‌లో వాల్టింగ్‌కు చిక్కాడు. అనంతరం దిల్‌రువాన్ పెరెరాతో కలిసి ధనంజయ డిసిల్వ స్కోరుబోర్డును ముందుకు కదిలించాడు. 66 ఓవర్ల వద్ద వాతావరణం ఆటకు అంతరాయం ఏర్పడింది. అంపైర్లు బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్, మైఖేల్ గాఫ్ వెలుతురు ఎంత ఉందనే విషయాన్ని మీటర్‌పై పరుమార్లు పరిశీలించారు. వాతావరణం ఎంతకీ కనుకూలించకపోవడంతో, రెండో రోజు ఆటను నిలిపివేస్తున్నట్టు వారు ప్రకటించారు. మొత్తం మీద రెండో రోజు 29.3 ఓవర్ల ఆట సాధ్యంకాగా, ధనంజయ డిసిల్వ 32, దిల్‌రువాన్ పెరెరా 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. కొలిన్ డి గ్రాండ్‌హోమ్, విలియమ్ సొమర్విల్లే చెరొక వికెట్‌ను తమ ఖాతాల్లో వేసుకున్నారు.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక (ఓవర్‌నైట్ స్కోరు 2 వికెట్లకు 85): వెలుతురు సరిగ్గా లేని కారణంగా రెండో రోజు ఆటను నిలిపివేసే సమయానికి 66 ఓవర్లలో 144. (దిముత్ కరుణరత్నే 65, కుశాల్ మేండిస్ 32, ధనంజయ డిసిల్వ 32 నాటౌట్, బౌల్ట్ 2/33, సౌథీ 2/40).