క్రీడాభూమి

రాయుడు యూటర్న్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: రిటైర్మెంట్‌పై అంబటి రాయుడు యూటర్న్ తీసుకున్నట్టు సమాచారం. స్థానిక మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం, ప్రస్తుతం టీఎన్‌సీఏ టోర్నమెంట్‌లో గ్రాండ్ శ్లామ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయుడు మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఏడాది జూలై మాసంలో అతను అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిలకడగా రాణిస్తున్నప్పటికీ, తనను కాదని విజయ్ శంకర్‌ను ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ కోసం ఎంపిక చేయడం రాయుడును నిరాశకు గురి చేసింది. ఆతరావత శిఖర్ ధావన్, విజయ్ శంకర్ గాయపడి వరల్డ్ కప్ టోర్నీకి దూరమైనప్పటికీ, రాయుడుకు అవకాశం ఇవ్వలేదు. రిషభ్ పంత్, మాయాంక్ అగర్వాల్‌ను పిలిపించడంతో మనస్తాపం చెందిన రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయతే, ఇప్పుడు పునరాలోచనలో పడినట్టు స్థానిక మీడియా కథనం. వనే్డల్లో ఆడాలని కూడా అతను కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.