క్రీడాభూమి

ఇంగ్లాండ్ పేసర్లను సమర్థంగా ఎదుర్కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, ఆగస్టు 21: ఎలంటి పేస్ బౌలింగ్‌నైనా తాము ఎదుర్కొంటామని ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ స్పష్టం చేశాడు. ఒక పత్రికకు రాసిన వ్యాసంలో అతను జట్టు కూర్పు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నాడు. మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ గాయపడి, మూడో టెస్టుకు దూరమైనప్పటికీ, అతని స్థానాన్ని భర్తీ చేయగల సమర్థులు జట్టులో ఉన్నారని తెలిపాడు. ‘స్మిత్ వంటి సీనియర్ ఆటగాడు గాయపడడం దురదృష్టకరం. అతను సమర్థుడైన బ్యాట్స్‌మన్. అయితే, స్మిత్ లేకపోయినా, ఇంగ్లాండ్ పేస్‌ను ఎదుర్కొనే సత్తా మా జట్టులోని బ్యాట్స్‌మెన్‌కు ఉంది’ అన్నాడు. ఫాస్ట్ బౌలింగ్‌ను ఆడడం తమకు అలవాటేనని తెలిపాడు. నెట్స్‌లో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జేమ్స్ పాటిన్సన్ వంటి మేటి ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటామని, ఆ ప్రాక్టీస్ తమకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నాడు. మెరుపు వేగంతో సంధించిన బౌన్సర్‌తో స్మిత్‌ను గాయపరచిన ఇంగ్లాండ్ పేసర్ జొఫ్రా ఆర్చర్ గురించి కూడా అతను ప్రస్తావించాడు. సమర్థుడైన ఒక యువ పేసర్ క్రికెట్ ప్రపంచానికి లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. అతనిని అభినందిస్తున్నానని తెలిపాడు. అయితే, ఆర్చర్ అంటే భయపడడం లేదని, అలాంటి బౌలింగ్‌ను ఏ విధంగా ఎదుర్కోవాలన్నది తమకు తెలుసునని పైన్ వ్యాఖ్యానించాడు.
ఆర్చర్‌కు భయపడం: లాంగర్
తమ ఆటగాడు స్టీవెన్ స్మిత్ గాయపడినంత మాత్రాన జొఫ్రా ఆర్చర్ బౌలింగ్‌కు భయపడే ప్రసక్తే లేదని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ స్పష్టం చేశాడు. స్మిత్, కెప్టెన్ టిమ్ పైన్ తదితరులతో కలిసి బుధవారం ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన అతను ఆతర్వాత విలేఖరులతో మాట్లాడుతూ రెండో టెస్టులో స్మిత్ 80 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద ఆడుతున్నప్పుడు ఆర్చర్ వేసిన బంతి మెరువు వేగంతో వచ్చి అతని మెడకు తగిలిన విషయం తెలిసిందే. క్రీజ్‌లోనే కుప్పకూలిన అతనికి అత్యవసర వైద్య సేవలు అందించారు. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన స్మిత్ ఆతర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. 92 పరుగులు చేసి, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్‌బీగా వెనుదిరిగాడు. పూర్తి ఫిట్నెస్‌తో లేని కారణంగా అతనికి మూడో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. ఇలావుంటే, ఆర్చర్ బౌలింగ్ అంటే ఆసీస్ బ్యాట్స్‌మెన్ భయపడుతున్నారని, ఎంతో అనుభవం ఉన్న స్మిత్ గాయపడడంతో, మిగతా ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ అంశాన్ని లాంగర్ ప్రస్తావిస్తూ, స్మిత్ గాయపడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించాడు. అయితే ఆర్చర్‌కుగానీ, బౌన్సర్లకుగానీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన తాము దీనిని మరింత పెంచేందుకు కృషి చేస్తామని అన్నాడు. బౌన్సర్ అనేది క్రికెట్‌లో కొత్త కాదని, బౌలర్ల అమ్ముల పొదిలో అది ఒకటని లాంగర్ వ్యాఖ్యానించాడు. బౌలర్లకు తమ వద్ద ప్రత్యేక వ్యూహం ఉందన్నాడు. ఇంగ్లాండ్‌ను ఎలా ఓడించాలో తమకు తెలుసునని అన్నాడు.