క్రీడాభూమి

హిమకు మరో స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత సంచలన స్ప్రింటర్ హిమ దాస్ ఖాతాలో మరో స్వర్ణం పతకం చేసింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న అథ్లెటికీ మిటిన్క్ రైటెర్ ఈవెంట్, మహిళల 300 మీటర్ల రేస్‌లో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. యూరోపియన్ రేసుల్లో, జూలై 2 నుంచి ఇప్పటి వరకూ ఆమెకు ఇది ఆరో స్వర్ణ పతకం కావడం విశేషం. నోవ్ మెస్టో (చెక్ రిపబ్లిక్) ఈవెంట్ 400 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తర్వాత, తిరిగి అదే దేశంలో హిమ మరోసారి విజయభేరి మోగించడం విశేషం.
ఇలావుంటే, మహమ్మద్ అనాస్ పురుషుల 300 మీటర్ల విభాగంలో స్వర్ణాన్ని అందుకున్నాడు. లక్ష్యాన్ని 32.41 సెకన్లలో పూర్తి చేసిన అతను విజేతగా నిలిచాడు. 400 మీటర్ల పరుగులో జాతీయ రికార్డును తన ఖాతాలో వేసుకున్న అతను ఇప్పటికే దోహాలో సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్స్‌కు అర్హత సంపాదించాడు. కాగా, హిమ 400 మీటర్ల ఈవెంట్‌లో ఇంకా క్వాలిఫై కాలేదు.