క్రీడాభూమి

స్వర్ణంపైనే సింధు గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బసెల్, ఆగస్టు 18: భారత బాడ్మింటన్ స్టార్, ‘తెలుగు తేజం’ పీవీ సింధు ప్రపంచ టైటిల్‌పై దృష్టి పెట్టింది. సోమ వారం నుంచి ఇక్కడ ప్రారంభం కానున్న బాడ్మింటన్ ప్ర పంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకొని, సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది. గత కొనే్నళ్లుగా ఈ మె గా ఈవెంట్‌లో సింధు చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటు న్నది. రెండు పర్యాయాలు కాంస్య పతకాన్ని గెల్చుకున్న ఆ మె, వరుసగా రెండుసార్లు రన్నరప్ ట్రోఫీని సొంతం చేసు కుంది. అయతే, చాలాకాలంగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకొవాలన్న పట్టుదలతో ఈసారి బరిలోకి దిగుతున్నది. 2017లో సుమారు 110 ని మిషాలు కొనసాగిన తుది పోరులో సింధు చివరి వరకూ తీవ్రంగానే పోరాడింది. అయతే, నవోమీ ఒకుహరా (జపా న్)ను ఓడించలేక, రజత పతకంతో సంతృప్తి చెందింది. గత ఏడాది కూడా ఆమె అద్వితీయ ప్రతిభతో ప్రత్యర్థులను ఓడిస్తూ ఫైనల్ చేరింది. కానీ, తన చిరకాల ప్రత్యర్థి, స్పెయ న్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో పరాజయాన్ని చవి చూసింది. గత నెల జరిగిన ఇండోనేషియా ఓపెన్‌లో రన్నర ప్‌గా నిలిచిన సింధు ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఐదో సీడ్‌గా మహిళల సింగిల్స్ వేటను కొనసాగిస్తుంది. మొదటి రౌండ్‌లో బై రావడంతో, ఆమె ప్రస్థానం రెండో రౌండ్ నుంచి మొదలవుతుంది. ఈ టోర్నమెంట్ కోసం ఎంతో కష్టపడి సిద్ధమయ్యాయని, ఫిట్నెస్ సమస్య లేకుం డా అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని సింధు ఆదివారం పీటీ ఐతో మాట్లాడుతూ చెప్పింది. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్వేచ్ఛగా ఆడతానని ఆమె అన్నది. మిగతా ఫలితాలన్నీ ఊ హించిన విధంగానే వస్తే, సింధుకు మూడో రౌండ్‌లో బీవెన్ జాంగ్ (అమెరికా) ఎదురవుతుంది. అదే విధంగా క్వార్టర్ ఫైనల్స్‌లో చైనీస్ తైపీకి చెందిన తాయ్ జూ ఇంగ్‌ను ఢీకొనా ల్సి రావచ్చు. మరో భారత స్టార్ సైనా నెహ్వాల్ కూడా ఈ టోర్నీలో టైటిల్ వేటను కొనసాగిస్తుంది. ఫలితాలు అంచ నాల ప్రకారమే ఉంటే, సైనాతో సింధు సెమీ ఫైనల్స్‌లో తల పడాల్సి ఉంటుంది. అంటే, భారత్ నుంచి స్వర్ణ పతకానికి పోటీలో ఎవరో ఒకరే ఉంటారన్నది ఖాయమైంది. అయతే ఇటీవల కాలంలో వీరి ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుం టే, సింధు సెమీస్ చేరడం ఖాయంగా కనిపిస్తున్నది. సైనా ఎంత వరకూ ముందంజ వేస్తుందో చూడాలి.