క్రీడాభూమి

ఆసీస్‌తో భారత్ మ్యాచ్ డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, ఆగస్టు 18: మహిళల హాకీ టెస్టు ఈ వెంట్ తొలి మ్యాచ్‌లో జపాన్‌ను 2-1 తేడాతో ఓడించి శుభారంభం చేసిన భారత్, ఆదివారం నాటి రెండో మ్యాచ్‌ని ఆస్ట్రేలియాతో డ్రా చేసుకుంది. ఇరు జట్లు చెరి గోల్స్ చేశాయ. ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఆసీస్ 14వ నిమిషంలోనే కైట్లిన్ నోబ్స్ దద్వారా తొలి గోల్‌ను అందుకుంది. అయతే, 36వ నిమిషంలో భారత్‌కు వందనా కాతరీయ ఈక్వెలైజర్‌ను సంపాదించిపెట్టింది. ఈ గోల్ నమోదైన తర్వాత మరోసారి ఆధిపత్యం కోసం ఆసీస్ క్రీడాకారిణులు ముమ్మరంగా ప్రయత్నించారు. 43వ నిమిషంలో గ్రేస్ స్టివార్ట్ గోల్ చేయడంతో, ఆసీస్‌కు 2-1 ఆధిక్యం లభించింది. కానీ, లెక్కను సరి చేయాలన్న పట్టుదలతో దాడులకు ఉపక్రమించిన భారత్ ప్రయత్నాలు 59వ నిలిషంలో ఫలించాయ. గుర్జిత్ కౌర్ చేసిన ఈ గోల్ భారత్‌ను ఓటమి నుంచి ఆదుకుంది.