క్రీడాభూమి

కరుణరత్నే సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే, ఆగస్టు 18: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌ని శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో గెల్చుకొని, రెండు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే సెంచరీతో జట్టు విజయాన్ని సులభతరం చేశాడు. కెరీర్‌లో అతనికి ఇది తొమ్మితో టెస్టు శతకం. రెండో ఇన్నింగ్స్‌లో 268 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన శ్రీలంక, మ్యాచ్ నాలుగో రోజు, శనివారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 133 పరుగులు చేసిన విషయం తెలిసిందే. చివరి రోజైన ఆదివారం, ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన లంక 161 పరుగుల వద్ద లాహిరు తిరిమానే రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అతను 163 బంతుల్లో, నాలుగు ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసి, విలియమ్ సొమెర్విల్లె బౌలింగ్‌లో ఎల్‌బీగా వెనుదిరిగాడు. కుశాల్ మేండిస్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, 10 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద, అజాజ్ పటేల్ బౌలింగ్‌లో జీత్ రావెల్‌కు దొరికిపోయాడు. క్రీజ్‌లో పాతుకుపోయి, 243 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 122 పరుగులు చేసిన కరుణరత్నేను జేబీ వాల్టింగ్ క్యాచ్ అందుకోగా టిమ్ సౌథీ పెవిలియన్‌కు పంపాడు. కుశాల్ పెరెరా 23 పరుగులు చేసి, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో, మిచెల్ సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా, చివరిలో ఏంజెలో మాథ్యూస్ (28 నాటౌట్), ధనంజయ డి సిల్వ (14 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డారు. శ్రీలంక 86.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 268 పరుగులు సాధించి, ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకే ఆలౌట్‌కాగా, శ్రీలంక 267 పరుగులు సాధించి, 18 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక ముందు 268 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని లంక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఛేదించి, సిరీస్‌పై ఆధిక్యాన్ని నమోదు చేసింది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 83.2 ఓవర్లలో 249 ఆలౌట్ (జీత్ రావెల్ 33, టామ్ లాథమ్ 30, రాస్ టేలర్ 86, హెన్రీ నికోల్స్ 42, సురంగ లక్మల్ 4/29, ధనంజయ డి సిల్వ 5/80).
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 93.2 ఓవర్లలో 267 ఆలౌట్ (దిముత్ కరుణరత్నే 39, కుశాల్ మేండిస్ 53, ఏంజెలో మాథ్యూస్ 50, నిరోషన్ డిక్వెల్లా 61, సురంగ లక్మల్ 40, అజాజ్ పటేల్ 5/89, విలియమ్ సొమెర్విల్లె 3/89, ట్రెంట్ బౌల్ట్ 2/45).
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 106 ఓవర్లలో 285 ఆలౌట్ (టామ్ లాథమ్ 45, బీజే వాల్టింగ్ 77, విలియమ్ సొమెర్విల్లె 40 నాటౌట్, లసిత్ ఎంబుల్డెనియా 4/99, లాహిరు కుమరా 2/31, ధనంజయ డి సిల్వ 3/25).
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (విజయ లక్ష్యం 268/ ఓవర్‌నైట్ స్కోరు వికెట్ నష్టం లేకుండా 133): 86.1 ఓవర్లలో 4 వికెట్లకు 268 (దిముత్ కరుణరత్నే 122, లాహిరు తిరిమానే 64, ఏంజెలో మాథ్యూస్ 28 నాటౌట్, ట్రెంట్ బౌల్ట్ 1/34, టిమ్ సౌథీ 1/33, విలియమ్ సొమెర్విల్లె 1/73, అజాజ్ పటేల్ 1/74).
చిత్రం...సెంచరీ హీరో దిముత్ కరుణరత్నే