క్రీడాభూమి

టీమిండియాదే సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: టీమిండియా మరో సిరీస్‌ను కైవసం చేసుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన చివరి వనే్డలో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌ను 2-0 కైవసం చేసుకుంది. అంతకుముం దు టాస్ గెలిచి విండీస్ బ్యాటింగ్ కు దిగింది. పలుమార్లు వర్షం మ్యా చ్‌కు అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించారు. దీంతో విండీస్ 35 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రిస్ గేల్ (72), ఎవిన్ లూయస్ (43)తో పాటు మిడిలార్దర్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ (30) రాణించారు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్‌కు 3 వికెట్లు దక్కగా, మహ్మద్ షమీ 2, యుజువేంద్ర చాహల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు.
మళ్లీ కోహ్లీ, అయ్యర్..
లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (10) తొందరగానే రనౌట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ తనదైన శైలిలో ఆడాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే శిఖర్ ధావన్ (36), రిషభ్ పంత్ (0) గోల్డెన్ డక్ కావడంతో భారత్ 92 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయంది. మరోవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ కోహ్లీ, యువ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి 121 కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే కోహ్లీ (114, నాటౌట్) మరో సెంచరీ సాధించాడు. మరోవైపు అయ్యర్ (65) అర్ధ సెంచరీ సాధించి అవుటయ్యాడు. కేదార్ జాదవ్ (19)తో కలిసి కోహ్లీ చివరి వరకు క్రీజులో ఉండి జట్టును 15 బంతులుండగానే గెలిపించాడు. దీంతో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను భారత్ 2-0తో గెలుచు కుంది. మొదటి వనే్డ వర్షం కారణం గా రద్దయిన విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయ.

చిత్రం...వనే్డ సిరీస్‌తో భారత జట్టు