క్రీడాభూమి

కోహ్లీ ఒక్కడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ఆగస్టు 15: భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ దశాబ్దంలో మూడు ఫార్మాట్లలో కలిపి 20వేల పరుగులకు పైగా సాధించిన ఏకైక క్రికెటర్‌గా అరుదైన ఘనతను సాధించాడు. విరాట్ మొత్తం 20,502 పరుగులు కాగా, ఈ దశాబ్దంలోనే 20,018 పరుగులను చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 43వ వనే్డ సెంచరీ సాధించడం ద్వారా ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో చేర్చుకున్నాడు. కోహ్లీ 2010లో టీ20 ఆరంగేట్రం చేయగా, అంతకుముందే 2008లో 484 పరుగులను వనే్డల్లో చేశాడు. విరాట్ కోహ్లీ తర్వాత 2000లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 18,962 పరుగులు చేయగా, అదే దశాబ్దంలో దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ క ల్లిస్ 16,777 రన్స్ సాధించాడు. ఇక శ్రీలంక లెజెండరీ క్రికెటర్లు మహిలా జయవర్దనే (16304), కుమార సంగాక్కర (15999) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. వీరి తర్వాత టీమిండియా బ్యాటింగ్ ఐకాన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (15962), రాహుల్ ద్రావిడ్ (15853) ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నారు.