క్రీడాభూమి
పాక్ అంపైర్ అరుదైన ఘనత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 August 2019
లండన్, ఆగస్టు 15: పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్ అరుదైన ఘనతను సాధించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా గురువారం జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచులో దార్ ఈ రికార్డును అందుకోవడం విశేషం. 51 ఏళ్ల అలీ మ్ దార్ ఇప్పటివరకు 128 టెస్టు మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించాడు. దీంతో వెస్టిండీస్‌కు చెందిన స్టీవ్ బక్నర్ పేరిట ఉన్న రికార్డును సమం చేసినట్లు ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) తన అధికారిక ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. 2003లో ఇంగ్లాండ్-బంగ్లాదేశ్‌తో జరిగి న టెస్టు మ్యాచ్‌కు అలీమ్ దార్ మొదటిసారి అంపైర్‌గా వ్యవహరిం చాడు. మొత్తం మూడు ఫార్మాట్లకు కలిపి 376 మ్యాచ్‌ల్లో దార్ అంపైరింగ్ చేయడం విశేషం.
చిత్రం... అలీమ్ దార్