క్రీడాభూమి

టాప్ ర్యాంకుపై కివీస్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలె, ఆగస్టు 13: టెస్ట్‌లో టాప్ ర్యాంకుపై న్యూజిలాండ్ దృష్టి సారించింది. బుధవారం నుంచి శ్రీలంకతో ప్రారంభయ్యే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను గెలుచుకొని టాప్‌లో నిలిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం టెస్టుల్లో న్యూజిలాండ్ 109 పాయంట్లతో రెండో స్థానంలో ఉండగా, టీమిండియా 113 పాయంట్లతో టాప్ లో కొనసాగుతోంది. ఇరు జట్లు 34 టెస్టుల్లో తలపడగా న్యూజిలాండ్ 15 మ్యాచుల్లో విజయం సాధించి, 8 మ్యా చుల్లో పరాజయం పాలైంది. మరో 11 మ్యాచులు డ్రాగా ముగిసాయ. ఇక శ్రీలంకలో న్యూజిలాండ్ ఆట తీరును పరిశీలిస్తే 15 టెస్టుల్లో నాలుగింట్లో మాత్రమే విజయం సాధించగా, 6 మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. మరో 5 మ్యాచులను డ్రా చేసుకుంది. ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్‌లో భాగంగా అత్యధిక పాయంట్లు సాధించిన రెండు జట్లు 2021లో లార్డ్స్ వేదికగా ఫైనల్‌లో తలపడునున్న విషయం తెలిసిందే.