క్రీడాభూమి

భారత్‌తో సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహానె్నస్‌బర్గ్, ఆగస్టు 13: భారత్‌తో జరిగే టెసు, టీ20 సిరీస్‌లకు కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. భారత పర్యటనలో సఫారీ జట్టు మూడు టీ20, మూడు టెస్టులు ఆడనుంది. ప్రపంచకప్‌లో ఘోర ఓటమి తర్వాత దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు జట్టులో భారీ మార్పులు చేసింది. ప్రధాన కోచ్ గిబ్సన్ కాంట్రాక్టును పొడిగించడం లేదని స్పష్టం చేసింది. ఇక ఇప్పటివరకు కెప్టెన్‌గా కొనసాగిన డుప్లెసిస్‌ను కేవలం టెస్టులకే పరిమితం చేసి, వైట్‌బాల్ క్రికెట్‌కు వికెట్ కీపర్ డికాక్‌ను సారథిగా ఎంపిక చేసినట్లు పేర్కొంది. మరోవైపు సీనియర్ క్రికెటర్లు డేల్ స్టెయన్, హషీమ్ ఆమ్లా రిటైర్మెంట్ ప్రకటించడంతో ముగ్గురు అన్ క్యాప్ ప్లేయర్లను జట్టులోకి తీసుకుంది. డుప్లెసిస్‌పై ఒత్తిడి తగ్గించేందుకే అతడిని టెస్టులకు మాత్రమే కెప్టెన్‌గా పరిమితం చేశామని, వచ్చే ఏడాది జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ వరకు డికాక్ అనుభవం లభించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. మొదటగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్ 15న మొదటి టీ20తో సిరీస్ ప్రారంభం కానుంది.
దక్షిణాఫ్రికా టెస్టు జట్టు: ఫఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), టెంబ బవుమా (వైస్ కెప్టెన్), థినిస్ డీ బ్రైన్, క్వింటన్ డికాక్, డీన్ ఎల్గార్, జుబేర్ హమ్జా, కేశవ్ మహరాజ్, అయడెన్ మార్క్రం, సినరన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, అన్‌రిచ్ నర్జే, వెర్నన్ ఫిలాండర్, డేన్ పీడ్ట్, కగిసో రబద, రుడి సెకండ్.
టీ20 జట్టు: క్వింటన్ డికాక్ (కెప్టెన్), రస్సే వన్ డర్ డుస్సెన్ (వైస్ కెప్టెన్), టెంబ బవుమా, జూనియర్ దాలా, జోర్న్ ఫార్ట్యూన్, బ్యూరన్ హెండ్రిక్స్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, అన్‌రిచ్ నర్జే, అండిలె ఫెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబద, తబ్రెయజ్ శంసి, జాన్‌జాన్ స్ముట్స్.