క్రీడాభూమి

నదీమ్‌కు ఐదు వికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టరౌబా (ట్రినిడాడ్ అండ్ టొబాగో), ఆగస్టు 10: భారత్ ‘ఏ’, వెస్టిండీస్ ‘ఏ’ జట్ల మధ్య జరిగిన మూడవ, చివరి అనధికార టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. అంతకు ముందే రెండు మ్యాచ్‌లను గెల్చుకున్న భారత్ ఈ సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. కాగా, చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్ ‘ఏ’ను లక్ష్యానికి చేరుకోకుండా అడ్డుకట్టవేసిన పేసర్ షాబాజ్ నదీమ్ ఐదు వికెట్లు కూల్చాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ‘ఏ’ 201 పరుగులకు ఆలౌట్‌కాగా, విండీస్ ‘ఏ’ కూడా భారీ స్కోరు సాధించలేక, 194 పరుగులకే పరిమితమైంది. ఏడు పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన భారత్ ‘ఏ’ రెండో ఇన్నింగ్స్‌ను నాలుగు వికెట్లకు 365 పరుగుల వద్ద డిక్లేర్ చేసి, వెస్టిండీస్ ‘ఏ’ ముందు 373 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. కాగా, మ్యాచ్ చివరి రోజున వికెట్ నష్టం లేకుండా 37 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన వెస్టిండీస్ ‘ఏ’, మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 314 పరుగులు చేయగలిగింది. జెరెమీ సొలొజనో 92, బ్రాండన్ కింగ్ 77, సునీల్ ఆంబ్రిస్ 69 చొప్పున పరుగులు సాధించి, విండీస్ ‘ఏ’ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. నదీమ్ 103 పరుగులిచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. మొదటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకు ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో 47 పరుగులకు ఐదు చొప్పున వికెట్లు తన ఖాతాలో వేసుకున్న నదీమ్, మూడో మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 28 పరుగులిచ్చి వికెట్ సాధించలేకపోయాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి ఐదు వికెట్ల ఫీట్‌ను నమోదు చేశాడు.
ఇలావుంటే, వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన టీమిండియాలో సభ్యులైన హనుమ విహారీ, వృద్ధిమాన్ సాహా, మాయాంక్ అగర్వాల్, ఉమేష్ యాదవ్ ఈ అనధికార టెస్టు సిరీస్‌లో చక్కటి ప్రతిభ కనబరిచారు. భారత్ ‘ఏ’కు నాయకత్వం వహించిన హనుమ విహారీ ఒక సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 224 పరుగులు సాధించాడు. వృద్ధిమాన్ సాహా 137 పరుగులు చేశాడు. అతని స్కోరులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. మాయాంక్ అగర్వాల్ ఒక హాఫ్ సెంచరీతో 123 పరుగులు చేశాడు. ఉమేష్ యాదవ్ చివరి మ్యాచ్‌లో ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16, రెండో ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లు చొప్పున మొత్తం 30 ఓవర్లు బౌల్ చేశాడు. రెండు వికెట్లు కూల్చాడు.