క్రీడాభూమి

దివ్యాంశ్ సెంచరీ వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బకెన్హామ్ (యూకే), ఆగస్టు 10: ఇక్కడ జరుగుతున్న అండర్-19 వనే్డ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో తలపడిన భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే, పాయింట్ల ఆధారంగా ఫైనల్లో చోటు దక్కించుకుంది. దివ్యాంశ్ సక్సేనా సెంచరీ భారత జట్టును ఆదుకోలేకపోయింది. వర్షం కారణంగా అంతరాయం ఏర్పడిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 278 పరుగులు చేసింది. దివ్యాంశ్ 102 పరుగులతో రాణించగా, ప్రియం గార్గ్ (51), తిలక్ వర్మ (52) అర్ధ శతకాలను నమోదు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు బెన్ చార్లెస్‌వర్త్ (46), టామ్ క్లార్క్ (66) చక్కటి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 15.5 ఓవర్లలో 72 పరుగులు జోడించారు. ప్రజ్ఞేష్ కాన్పిల్లెవార్ బౌలింగ్‌లో చార్లెస్‌వర్త్ ఔటైన తర్వాత, జట్టును లక్ష్యానికి చేర్చే బాధ్యతను క్లార్క్‌తో కలిసి డాన్ మోస్లే స్వీకరించాడు. ఈ దశలో వర్షం కురవడంతో, డక్‌వర్త్ లూయిస్ విధానాన్ని అనుసరించి మ్యాచ్‌ని 42 ఓవర్లకు కుదించి, ఇంగ్లాండ్ లక్ష్యాన్ని 214 పరుగులుగా నిర్ధారించారు. ఆ ప్రకారం 30 బంతుల్లో 56 పరుగులు సాధించాల్సిన ఇంగ్లాండ్‌కు మోస్లే అండగా నిలిచాడు. మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడి, మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించాడు. కాగా, కేవలం ఐదు పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి పరిమితమైన ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన భారత్ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఢీ కొంటుంది. బంగ్లాదేశ్ 11 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించి ఫేవరిట్‌గా ముద్ర వేయించుకుంది.