క్రీడాభూమి

గేల్ ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ఆగస్టు 10: హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్‌కు భారత్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో చోటు దక్కలేదు. 2014లో చివరి సారి టెస్టు ఆడిన గేల్ ప్రతిసారీ తనకు జట్టులో స్థానం ఉంటుందనే ఆశతోనే ఉన్నాడు. కానీ, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించిన 13 మంది సభ్యుల జాబితాలో అతని పేరు లేదు. దీనితో టెస్టు ఫార్మాట్‌కు మరో ఆరు వారాల్లో 40వ ఏట అడుగుపెట్టనున్న గేల్ శాశ్వతంగా దూరంకాక తప్పదని విశే్లషకులు అంటున్నారు. భారత్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి వనే్డలో అతను ఏకంగా 31 బంతులు ఎదుర్కొని, కేవలం నాలుగు పరుగులు చేసి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతను ఏమాత్రం ఫామ్‌లో లేడని చెప్పడానికి ఇదో నిదర్శనం. ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ప్రారంభానికి ముందు ఒక ఇంటర్వ్యూలో, తాను భారత్‌తో కింగ్‌స్టన్‌లో చివరి టెస్టు ఆడాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. టెస్టు ఫార్మాట్‌కు అతను గుడ్‌బై చెప్పనున్నాడని ఆ ప్రకటన స్పష్టం చేసింది. అయితే, అతను కోరుకున్నట్టు చివరి టెస్టును భారత్‌తో ఆడే అవకాశం కల్పిస్తారని అంతా కనుకున్నారు. కానీ, రాబర్ట్ హేన్స్ నేతృత్వంలోని విండీస్ సెలక్షన్ కమిటీ అతనివైపు మొగ్గు చూపలేదు. గేల్‌ను టెస్టు సిరీస్‌కు ఎంపిక చేస్తే, విండీస్ తిరోగమనం మొదలైనట్టేనని మాజీ పేసర్ కర్ట్‌లీ ఆంబ్రోస్ వ్యాఖ్యానించడం విశేషం. సుమారు ఐదేళ్లు కాలంలో ఒక్క టెస్టు కూడా ఆడని అతనిని భారత్‌తో సిరీస్‌కు ఎంపిక చేస్తారనుకోవడం అత్యాశే అవుతుందని అన్నాడు. వనే్డ, టీ-20 ఫార్మాట్స్‌లో ఆడే సత్తా అతనికి ఉందని సెలక్షన్ కమిటీ నమ్ముతున్నదని, అయితే, టెస్టులకు మాత్రం అతనితో ప్రయోగాలు చేయదలచుకోలేదని తేల్చిచెప్పాడు.
విండీస్ టెస్టు జట్టు: జాసన్ హోల్డర్ (కెప్టెన్), క్రెగ్ బ్రాత్‌వెయిట్, డారెన్ బ్రేవో, షమ్రా బ్రూక్స్, జాన్ కాంప్‌బెల్, రాస్టన్ ఛేజ్, రఖీమ్ కార్న్‌వాల్, షేన్ డౌరిచ్ (వికెట్‌కీపర్), షానన్ గాబ్రియల్, షిమ్రన్ హాత్‌మేయర్, షాయ్ హోప్, కీమో పాల్, కెమర్ రోచ్.