క్రీడాభూమి

పర్వతాకారుడు కార్న్‌వాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన విండీస్ జట్టులో చోటు దక్కించుకున్న రఖీమ్ కార్న్‌వాల్‌ను పర్వతాకారుడిగా అభివర్ణిస్తున్నారు. 6 అడుగుల, 6 అంగుళాల పొడవు, 140 కిలోల బరువుతో కార్న్‌వాల్ ప్రత్యేకంగా కనిపిస్తాడు. 2014లో మొదటి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన అతను ఆల్‌రౌండర్. ఇంత వరకూ 55 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 260 వికెట్లు పడగొట్టాడు. 2,224 పరుగులు సాధించాడు. ఇటీవల భారత్‌తో జరిగిన రెండు అనధికార టెస్టుల్లో అతను రెండు అర్ధ శతకాలు నమోదు చేసి సత్తా చాటుకున్నాడు. నిలకడగా రాణిస్తున్న అతనికి చోటు కల్పించడం సమంజసమని సెలక్షన్ కమిటీ చీఫ్ రాబర్ట్ హేన్స్ వ్యాఖ్యానించాడు. భారత్‌పై అతను అద్భుతంగా రాణిస్తాడన్న ధీమా వ్యక్తం చేశాడు.