క్రీడాభూమి

ఆర్చరీకి మంచి రోజులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: భారత ఆర్చరీ రంగానికి మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తున్నది. అంతర్గత కుమ్ములాటల కారణంగా సస్పెన్షన్‌కు గురైన భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) పాలనా వ్యవహారాలను చూసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వడంతో సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని ఏఏఐపై నిషేధాన్ని వరల్డ్ ఆర్చరీ ఎత్తివేయడానికి మార్గం సుగమమైంది. అయితే, సమస్యను పూర్తిగా పరిష్కరించడాకి సమగ్ర కార్యాచరణను ఖాయం చేసుకొని, దానిని పటిష్టంగా అమలు చేస్తేనే సస్పెన్షన్‌ను రద్దు చేయడం సాధ్యమవుతుందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతాకు రాసిన లేఖలో వరల్డ్ ఆర్చరీ కార్యదర్శి టామ్ డీలెన్ స్పష్టం చేశాడు. ఏఏఐపై ఆధిపత్యం కోసం బీవీపీ రావు, వీరేంద్ర సచ్‌దేవ వర్గాలు తీవ్ర స్థాయిలో పోటీపడ్డాయి. ఎవరికి వారే తమదే సిసలైన సంఘమని ప్రకటించుకున్నాయి. ఇరు వర్గాలు మొండి వైఖరిని వీడకపోవడంతో, ఏఏఐని గుర్తింపును రద్దు చేస్తున్నట్టు వరల్డ్ ఆర్చరీ ప్రకటించింది. కాగా, వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరగా, జమ్మూకాశ్మీర్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి బీడీ ఆనంద్ నేతృత్వంలో ఐదురుగురు సభ్యులతో తాత్కాలిక కమిటీని నియమించింది. ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆర్. రాజగోపాల్‌తోపాటు ఆధిపత్యం కోసం పోటీపడిన బీవీపీ రావు, వీరేంద్ర సచ్‌దేవను ఈ కమిటీలో సభ్యులుగా ప్రకటించింది. ఏఏఐకి పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు వీలు కలగడంతో, ఏఏఐపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు వరల్డ్ ఆర్చరీ సానుకూలంగా స్పందించింది. పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించి, కొత్త పాలక మండలి ఏర్పడేందుకు అవసరమైన కార్యాచరణను ఖరారు చేసుకోవాలని ఐఓఏకు రాసిన లేఖలో తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కోరింది. బ్యాంకాక్‌లో నవంబర్ మాసంలో జరిగే ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు సెలక్షన్స్‌తోపాటు, 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హతా పోటీలను కూడా నిర్వహించాలంటే ఏఏఐపై నిషేధం ఉండకూడదు. అందుకే, సస్పెన్షన్ రద్దు కోసం ఏఏఐ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇలావుంటే, ఈనెల 23న కమిటీ సమావేశమై, అన్ని అంశాలను చర్చిస్తుంది. ఆ తర్వాత ఎన్నికల నిర్వాహణకు కార్యాచరణ ప్రణాళికను ఖాయం చేస్తుంది.