క్రీడాభూమి

నాడా పరిధిలోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: భారత క్రికెటర్లు ఇక నాడా (నేషనల్ యాంటి డోపింగ్ జెన్సీ) డోపిం గ్ టెస్టుల్లో పాల్గొనాల్సిందేనని క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆటగాళ్లంతా సమానమేన ని, ఈ విషయంలో క్రికెటర్లకు ఎలాంటి మినహాయంపులు ఉండవని, చట్టానికి లోబడి తప్ప బీసీసీఐ కూడా ప్రత్యామ్నాయ మార్గం లే దని క్రీడా శాఖ కార్యదర్శి ఆర్‌ఎస్ జులానియా వెల్లడించాడు. ఇక ఈనిర్ణయంతో టీమిండియా ఆ టగాళ్లు నాడా పరిధిలోకి రానున్నారు. అయతే నాడా పనితీరుపై బీసీసీఐకి అభ్యంత రాలు ఉన్నాయ. అందుకనే బోర్డే తన ఆటగాళ్ల కు ఇన్నాళ్లూ డోప్ టెస్టులు నిర్వహిస్తూ వస్తోం ది. ఇదిలాఉండగా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో ఉన్న టెర్బుటలైన్ ఉత్ప్రేరకాన్ని వాడిన యువ క్రికెటర్ పృథ్వీ షా 8 నెలల నిషేధానికి గురైన విషయం తెలిసిందే.
అవగాహన లేక టెర్బుటలైన్ మెడిసిన్ తీసుకున్నట్లు పృథ్వీ బీసీసీఐకి వివరణ ఇ చ్చాడు. అయతే డోప్ టెస్టులు, శిక్షల ఖరారు చేయడం పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుందని కేంద్ర క్రీడల శాఖ ఇటీవల బీసీసీఐకి లేఖ రాసింది. అంతర్జాతీయ డోపిండ్ వ్యతిరేక ఏజెన్సీ గుర్తించిన సంస్థ ద్వారానే డోప్ టెస్టులు నిర్వహించాలని బోర్డుకు సూచించింది. అయతే బీసీసీఐ మాత్రం తమ డోపింగ్ టెస్టులు అత్యు న్నత నాణ్యాతా ప్రమాణాలతో జరుగుతున్నా యని పేర్కొనడం విశేషం. అయతే నాడా పనితీరుపై అనుమానాలున్నాయని బీసీసీఐ యాంటి డోపింగ్ మేనేజర్ అభిజిత్ సాల్వి అన్నారు.