క్రీడాభూమి

చెలరేగిన క్రిష్ణప్ప గౌతమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టరౌబ, ఆగస్టు 8: వెస్టిండీస్ ఏ జట్టుతో జరిగిన మూడో అనధికార టెస్టులో టీమిండియా ఏ జట్టుకు చెందిన ఆఫ్ స్పిన్నర్ క్రిష్ణప్ప గౌతమ్ 6 వికెట్లతో చెలరేగాడు. దీంతో వెస్టిండీస్ ఏ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత ఏ జట్టు 3 వికెట్లను కోల్పోయ 23 పరుగులు చేసింది. వికెట్ నష్టపోయ ఓవర్ నైట్ స్కోరు 23 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఏ జట్టు బ్యాట్స్‌మెన్లు అకీమ్ ఫ్రాజర్, బ్రెండర్ కింగ్‌లను ఉమేశ్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 36 పరుగులకే 3 వికెట్లను కోల్పోయంది. ఆ తర్వాత ఓపెనర్ జెరిమీ సోలోజనో (69, నాటౌట్), సునీల్ అంబ్రిస్ (43) కొద్దిసేపు భారత బౌలర్లను ప్రతిఘటించారు. వీరిద్దరూ కలిసి 66 పరుగుల భాగస్వామ్యాన్ని జట్టుకు అందించారు. ఈ జంటను శివమ్ దుబే విడదీశాడు. ఇక కెప్టెన్ హను మ విహారి గౌతమ్ క్రిష్ణప్పకు బాల్ అందించాడు. అప్పటికీ విండీస్ ఏ జట్టు 4 వికెట్లను కోల్పోయ 134 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. ఈ దశలో బాల్ అందుకున్న గౌతమ్ రెండో రోజు 5 వికెట లను (మొదటి రోజు 1) తీయడంతో విండీస్ ఏ జట్టు 73 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్‌లో గౌతమ్ 67 పరుగులిచ్చి 6 వికెట్లను తీశాడు. దీంతో భారత జట్టుకు 7 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత ఏ జట్టును విండీస్ పేసర్ కీమర్ హోల్డర్ దెబ్బతీశాడు. ఓపెనర్లు ప్రియాంక్ పంచల్ (3), అభిమాన్యు ఈశ్వరన్ (6)ను వెంటవెంటనే పెవిలియన్‌కు పంపించాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ (5) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. రెండో రోజూ ముగిసే సమయానికి భారత ఏ జట్టు 3 వికెట్లను కోల్పోయ 23 పరుగులు చేసింది. అంత కుముందు మొదటి ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేయగా, కెప్టెన్ హనుమ విహారి 139 బంతుల్లో 55 పరుగులకు తోడు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 66 బంతుల్లో 62 పరుగులు చేశాడు. వీరిద్దరూ అర్ధ సెంచరీలు సాధించడమే కాకుండా 5వ వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.