క్రీడాభూమి

బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్ జట్టులో మేరీ కోమ్, లలీనాకు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: రాబోయే బాక్సింగ్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో ఆరు పర్యాయాలు ఈ టోర్నీలో విజేతగా నిలిచిన మేరీ కోమ్, లలీనా బొర్గోహైన్ చోటుసంపాదించుకున్నారు. అయితే, ట్రయల్స్ లేకుండా జట్టు ఎంపికను ప్రపంచ జూనియర్ ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ విమర్శించింది. ఏ మేజర్ టోర్నీకైనా అర్హత పోటీలు నిర్వహించిన తర్వాతే ఎంపిక జరుగుతుందని ఆమె స్పష్టం చేసింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా బాక్సింగ్ సమాఖ్య వ్యవహరించిందని ఆమె ఆరోపించింది. కాగా, ఇటీవలి కాలంలో మేరీ కోమ్, లలీనా అద్భుతంగా రాణించారని, అందుకే వారిని ఎంపిక చేశామని భారత బాక్సింగ్ సమాఖ్య వివరించింది. 36 ఏళ్ల మేరీ కోమ్ ఇటీవలే సమాఖ్య అధికారులను కలిసింది. ఆ తర్వాతే ఆమె పేరు ఈ జాబితాలో చేరింది. ఈ వ్యవహారాన్ని 23 ఏళ్ల హైదరాబాదీ జరీన్ తీవ్ర పదజాలంతో విమర్శించింది. సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించకుండా అభ్యర్థులను ఎంపిక చేయడం సరైన విధానం కాదని సమాఖ్యకు రాసిన ఒక లేఖలో పేర్కొంది. వెంటనే ట్రయల్స్ నిర్వహించాలని ఆమె కోరింది.