క్రీడాభూమి

4వ స్థానంలో రాహుల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రావిడెన్స్ (గయనా), ఆగస్టు 7: వెస్టిండీస్‌ను టీ-20 సిరీస్‌లో 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా వనే్డ సిరీస్‌లోనూ అదే దూకుడును కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. గురువారం జరిగే మొదటి వనే్డలో బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం తప్పనిసరిగా కనిపిస్తోంది. వరల్డ్ కప్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో గాయపడిన శిఖర్ ధావన్ మళ్లీ జట్టులోకి రావడంతో రోహిత్ శర్మతో కలిసి అతను ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో లోకేష్ రాహుల్‌ను 4వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం అనివార్యమవుతుంది. మొదటి మూడు స్థానాల్లో రోహిత్ శర్మ, ధావన్, కోహ్లీ బ్యాటింగ్‌కు రావడం ఖాయం. కాబట్టి రాహుల్‌కు 4వ స్థానం మాత్రమే దక్కుతుంది. అదే జరిగితే ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ 5 లేదా 6 స్థానంలో బ్యాటింగ్‌కు వెళ్లవచ్చు. ఈ స్థానాలను అతనితోపాటు రిషబ్ పంత్ పంచుకుంటాడు. ఎవరు నిలకడగా రాణిస్తారన్న అంశంపైనే వీరి బ్యాటింగ్ ఆర్డర్ ఆధారపడి ఉంటుంది. బౌలింగ్ విభాగానికి వస్తే వారం రోజుల వ్యవధిలో భువనేశ్వర్ కుమార్ రెండు దేశాల్లో 3 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. ఫాస్ట్ బౌలర్ అవిశ్రాంతంగా క్రికెట్ ఆడడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయన్నది వాస్తవం. ఈ కారణంగా మొదటి వనే్డ నుంచి అతనికి విశ్రాంతినిస్తే, ఆ స్థానంలో మహమ్మద్ షమీతో భర్తీ చేయాల్సి ఉంటుంది. యువ పేసర్ నవదీప్ సైనీ వనే్డల్లో ఆరంగేట్రం చేసే అవకాశం లభించవచ్చు. స్పిన్ బౌలింగ్‌లో సైనీ అద్భుత ప్రతిభ కనబరుస్తుండడంతో వనే్డ ఫార్మాట్‌లో అతను అద్భుతంగా రాణిస్తాడని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇలావుంటే, జాసన్ హోల్డర్ నాయకత్వంలోని వెస్టిండీస్ కూడా బలంగా కనిపిస్తోంది. క్రిస్ గేల్, జాన్ క్యాంబెల్, ఇవిన్ లూయిస్, షాయ్ హోప్, చార్లోస్ బ్రాత్‌వైట్, కెమెర్ రోచ్, నికొలస్ పూరన్ వంటి సమర్థులైన ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. అయితే, చాలాకాలంగా వీరు నిలకడగా రాణించలేకపోవడం విండీస్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. టీ-20 సిరీస్‌లో ఎదురైన వైఫల్యాలను వనే్డ సిరీస్‌లో విండీస్ ఏవిధంగా అధిగమిస్తుందో చూడాలి.