క్రీడాభూమి

భారత క్రికెట్‌ను దేవుడే రక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: భారత క్రికెట్ నియంత్రణా బోర్డు (బీసీసీఐ) ఇటీవలి వ్యవహారశైలిపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, స్పిన్నర్ హర్బజన్ సింగ్ మండిపడ్డారు. భారత-ఏ, జూనియర్ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్‌కు పరస్పర ప్రయోజనాలు ఉన్నాయంటూ బీసీసీఐ ఎథిక్స్ కమిటీ నోటీసును జారీ చేయడంపై వీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టును భగవంతుడే రక్షించాలని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ గుప్తా ఇటీవల ఒక ప్రకటన చేస్తూ ద్రవిడ్‌కు పరస్పర ప్రయోజనాలు కలిగే హోదాలు ఉన్నాయని ఆరోపించాడు. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్య సంస్థ ఇండియా సిమెంట్స్ గ్రూప్‌కు వైస్‌ప్రెసిడెంట్‌గా ద్రవిడ్ వ్యవహరిస్తున్నాడని వివరించాడు. పరస్పర ప్రయోజనాలను కలిగించే హోదాల్లో ఉన్నందున అతను భారత్-ఏ, జూనియర్ జట్లకు కోచ్‌గా ఎలా ఉంటాడని ప్రశ్నించాడు. గుప్తా ప్రకటన ఆధారంగా ద్రవిడ్‌పై బీసీసీఐ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది. పరస్పర ప్రయోజనాల అంశంలో స్పష్టతనివ్వాలని అందులో ఆదేశించింది. ఈ పరిణామంపై గంగూలీ, భజ్జీ స్పందిస్తూ ఇలాంటి చిత్రమైన వైఖరిని తామెప్పుడూ చూడలేదని వేర్వేరు ప్రకటనల్లో వ్యాఖ్యానించారు. ఇలా అనుమానం వ్యక్తం చేసుకుంటూపోతే భారత క్రికెట్ దారుణంగా దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బీసీసీఐ తన వైఖరిని మార్చుకోవాలని కోరారు.