క్రీడాభూమి

కోహ్లీదే అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ, జూలై 23: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ ర్యాకింగ్స్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తాజాగా మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జాబితాలో కోహ్లీ 922 పాయింట్లతో తొలి స్థానంలో నెంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 913 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా 881 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక వరుసగా ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ (857), న్యూజిలాండ్ ఆటగాడు హెన్రీ నికోల్స్ (778), జో రూట్ (763), డేవిడ్ వార్నర్ (756), అయడెన్ మార్క్రం (719), క్వింటన్ డీకాక్ (718), ఫఫ్ డుప్లెసిస్ (702) పాయింట్లతో టాప్ 10లో చోటు సంపాదించుకున్నారు.
జడేజా, అశ్విన్ మాత్రమే..
ఇదిలా ఉంటే బౌలింగ్ విభాగంలో భారత్‌కు చెందిన సీనియర్ బౌలర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే టాప్ 10 స్థానాన్ని పదిలం చేసుకన్నారు. ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమ్మిన్స్ 878 పాయంట్లతో టాప్‌లో కొనసాగుతుండగా, ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (862), దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబద (851) పాయంట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరుసగా వెర్నర్ ఫిలాండర్ (813), నెయల్ వాగ్నర్ (801), రవీంద్ర జడేజా (794), ట్రెంట్ బౌల్ట్ (787), మహమ్మద్ అబ్బాస్ (770), జాసన్ హోల్డర్ (770), రవిచంద్రన్ అశ్విన్ (763) పాయంట్లతో టాప్ 10లో చోటు దక్కించుకున్నారు.
మనమే నెం.1
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన ప్రకారం టీమిండియా జట్టు టెస్టుల్లో నెం.1 స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 32 మ్యాచుల్లో 3631 పాయింట్లతో 113 రే టింగ్స్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ (111), దక్షిణాఫ్రికా (108), ఇంగ్లాండ్ (105), ఆస్ట్రేలియా (98), శ్రీలంక (94), పాకిస్తాన్ (84), వెస్టిండీ స్ (82), బంగ్లాదేశ్ (65), జింబాబ్వే (16) రేటింగ్స్‌తో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.