క్రీడాభూమి

నాది పొరపాటు నిర్ణయమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జూలై 21: ప్రపంచకప్ ఫైనల్‌లో తనది పొరపాటు నిర్ణయమని ఆ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన కుమార్ ధర్మసేన పేర్కొన్నాడు. చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ బెన్‌స్టోక్స్ బ్యాట్‌కి తాకి బంతి ఓవర్ త్రోగా బౌండరీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ధర్మసేన మాట్లాడుతూ ఆరు పరుగులివ్వడం తను చేసిన పొరపాటని, అందుకు చింతిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఈ విషయం టీవీ రిప్లైలో చూసిన తర్వాతే తెలిసిందన్నాడు. అంతకుముందు కూడా పరుగులిచ్చేందు కు ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్‌తో పాటు టీవీ అంపైర్లను సంప్రదించినట్లు తెలిపారు. వారు సరిగ్గా చూడకపోవడం తో పొరపాటు జరిగిపోయందన్నాడు. అయితే చేసిన తప్పుకు క్షమాపణలు అడిగే అర్హత లేదని విచారం వ్యక్తం చేశాడు. అంపైర్ కుమార్ ధర్మసేన తప్పుడు నిర్ణయంతో ఫైనల్ మ్యాచ్ టై కాగా, ఆ తర్వాత సూపర్ ఓవర్ కూడా టై కావడంతో బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. అయతే ఓవర్ త్రో రూపంలో పరుగులు రాకుంటే మాత్రం కచ్చితంగా న్యూజిలాండ్ జట్టే విజేతగా నిలిచేదని పలువురు క్రికెటర్లతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.