క్రీడాభూమి

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 19: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్టాత్మకమైన హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్‌కు చోటు లభించింది. సచిన్‌తోపాటు, దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అలాన్ డొనాల్డ్, రెండు పర్యాయాలు ఆస్ట్రేలియాకు మహిళల వరల్డ్ కప్‌ను సాధించిపెట్టిన కాథరిన్ ఫిజ్‌పాట్రిక్ పేర్లను కూడా ఐసీసీ ఈ జాబితాలో చేర్చింది. లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సచిన్, డొనాల్డ్, ఫిజ్‌పాట్రిక్‌ను హాల్ ఆఫ్ ఫేమ్ గుర్తింపుతో సత్కరించింది. కాగా, తనకు ఈ గౌరవం దక్కడంపై సచిన్ ఆనందం వ్యక్తం చేశాడు. క్రికెట్‌కు అత్యుత్తమ సేవలు అందించిన వారిని ఈ గుర్తింపు లభిస్తుందని, తన వంతు పాత్ర పోషించడం ఎంతో సంతోషాన్నిస్తున్నదని చెప్పాడు. తన తల్లిదండ్రులు, భార్య అంజలి, సోదరుడు అజిత్ వంటి ఎంతో మంది అందించిన మద్దతుతో తాను కెరీర్‌ను కొనసాగించగలిగానని 46 ఏళ్ల సచిన్ పేర్కొన్నాడు. రమాకాంత్ ఆచ్రేకర్ వంటి గురువు లభించడం తన అదృష్టమన్నాడు. తన కెప్టెన్లకు, తోటి ఆటగాళ్లకు, బీసీసీఐ, ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకొన్నాడు. తన కెరీర్‌కు గుర్తింపుగా హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించినందుకు ఐసీసీకి రుణపడి ఉంటానని అన్నాడు. తన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పాడు. అలాన్ డొనాల్డ్, కాథరిన్ ఫిజ్‌పాట్రిక్ కూడా ఈ గౌరవం దక్కడం తమకు ఎంతో ఆనందాన్నిస్తున్నదని అన్నారు.

బ్యాటింగ్‌లో దాదాపు అన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సచిన్ తెండూల్కర్ కెరీర్‌లో, అన్ని ఫార్మాట్స్‌లో కలిపి 34,357 పరుగులు సాధించాడు.
వంద అంతర్జాతీయ సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. సుమారు 24 ఏళ్లపాటు కెరీర్‌ను కొనసాగించి, తన తిరుగులేని ఫిట్నెస్‌ను, ఆట పట్ల ఉన్న అంకిత భావాన్ని నిరూపించుకున్నాడు. మరెవరూ అందుకోలేని రీతిలో 200 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. రెండో స్థానంలో ఉన్న రికీ పాంటింగ్, స్టీవ్ వా చెరి 168 టెస్టులు మాత్రమే ఆడారంటే, సచిన్ నెలకొల్పిన రికార్డును అందుకోవడం అనుకున్నంత సులభం కాదన్నది స్పష్టమవుతుంది.

సచిన్ గణాంకాలు

టెస్టు క్రికెట్
మ్యాచ్‌లు: 200, ఇన్నింగ్స్: 329, నాటౌట్: 33, అత్యధిక స్కోరు: 248, సాధించిన పరుగులు: 15,921, సెంచరీలు: 51, డబుల్ సెంచరీలు: 6,
హాఫ్ సెంచరీలు:68,
ఫోర్లు: 2,058, సిక్సర్లు: 69.
బౌలింగ్‌లో బంతులు: 4,240,
ఇచ్చిన పరుగులు: 4,240, వికెట్లు: 46,
అత్యుత్తమ ప్రదర్శన: 10 పరుగులకు 3 వికెట్లు.
వనే్డ ఇంటర్నేషనల్స్
మ్యాచ్‌లు: 463, ఇన్నింగ్స్: 462,
నాటౌట్: 41, అత్యధిక స్కోరు: 200,
సాధించిన పరుగులు: 18,426, సెంచరీలు: 49,
డబుల్ సెంచరీలు: 1, హాఫ్ సెంచరీలు: 96,
ఫోర్లు: 2,016, హాఫ్ సెంచరీలు: 195.
బౌలింగ్‌లో వేసిన బంతులు: 8,054,
ఇచ్చిన పరుగులు: 6,850,
వికెట్లు: 154,
అత్యుత్తమ ప్రదర్శన: 32 పరుగులకు 5 వికెట్లు.
టీ-20 ఇంటర్నేషనల్స్
మ్యాచ్‌లు: 1, ఇన్నింగ్స్: 1,
పరుగులు 10, ఫోర్లు: 2.
బౌలింగ్‌లో వేసిన బంతులు: 15, ఇచ్చిన పరుగులు: 12, వికెట్లు: 1.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
మ్యాచ్‌లు: 78, ఇన్నింగ్స్: 48, నాటౌట్ 9,
పరుగులు: 2,334, అత్యధిక స్కోరు: 100,
సెంచరీలు: 1, హాఫ్ సెంచరీలు: 13,
ఫోర్లు: 495, సిక్సర్లు: 29.
బౌలింగ్‌లో వేసిన బంతులు: 36,
ఇచ్చిన పరుగులు: 58, వికెట్లు: 0.
మొదటి టెస్టు: 1989 నవంబర్ 15న/ పాకిస్తాన్‌పై.
చివరి టెస్టు: 2013 నవంబర్ 14న/ వెస్టిండీస్‌పై.
మొదటి వనే్డ: 1989 డిసెంబర్ 18న/ పాకిస్తాన్‌పై.
చివరి వనే్డ: 2012 మార్చి 18న/ పాకిస్తాన్‌పై.
ఏకైక టీ ట్వంటీ: 2006 డిసెంబర్ 1న/
దక్షిణాఫ్రికాపై.
మొదటి ఐపీఎల్: 2008 మే 14న/ చెన్నై సూపర్ కింగ్స్‌పై.
చివరి ఐపీఎల్: 2013 మే 13న/
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై.

‘వైట్ లైట్నింగ్’ అలాన్ డొనాల్డ్ గణాంకాలు

టెస్టులు క్రికెట్
మ్యాచ్‌లు: 72, ఇన్నింగ్స్: 94, నాటౌట్: 33, పరుగులు: 652, అత్యధిక స్కోరు: 37, ఫోర్లు: 66.
బౌలింగ్‌లో వేసిన బంతులు: 15,519, ఇచ్చిన పరుగులు: 7,344, వికెట్లు: 330, అత్యుత్తమ ప్రదర్శన: 71 పరుగులకు 8 వికెట్లు, ఐదేసి వికెట్లు: 20 పర్యాయాలు, పదేసి వికెట్లు: మూడు సార్లు.
వనే్డ ఇంటర్నేషనల్స్
మ్యాచ్‌లు: 164, ఇన్నింగ్స్: 40, నాటౌట్: 18, పరుగులు: 95, అత్యధిక స్కోరు 13, ఫోర్లు: 28.
బౌలింగ్‌లో వేసిన బంతులు: 8,561, ఇచ్చిన పరుగులు: 5,926, వికెట్లు: 272, అత్యుత్తమ ప్రదర్శన: 23 పరుగులకు 6 వికెట్లు, ఐదేసి వికెట్లు: రెండు పర్యాయాలు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్
మ్యాచ్‌లు: 316, ఇన్నింగ్స్: 370, నాటౌట్: 73, పరుగులు: 544, అత్యధిక స్కోరు: 55 (నాటౌట్).
బౌలింగ్‌లో వేసిన బంతులు: 58,801, ఇచ్చిన పరుగులు: 27,680, వికెట్లు: 1,216, అత్యుత్తమ ప్రదర్శన: 37 పరుగులకు 8 వికెట్లు, ఐదేసి వికెట్లు: 68 పర్యాయాలు, పదేసి వికెట్లు: తొమ్మిదిసార్లు.

కాథెరిన్ ఫిజ్‌పాట్రిక్ గణాంకాలు..

టెస్టు క్రికెట్
మ్యాచ్‌లు: 13, ఇన్నింగ్స్: 9, పరుగులు: 152, అత్యధిక స్కోరు: 53, క్యాచ్‌లు: 5.
బౌలింగ్‌లో వేసిన బంతు లు: 3,603, ఇచ్చిన పరుగులు: 1,147, వికెట్లు: 60, అత్యుత్తమ ప్రదర్శన: 29 పరుగులకు ఐదు వికెట్లు.
వనే్డ ఇంటర్నేషనల్స్
మ్యాచ్‌లు: 109, ఇన్నింగ్స్: 58, నాటౌట్: 19, పరుగులు: 651, అత్యధిక స్కోరు: 43, క్యాచ్‌లు: 45.
బౌలింగ్‌లో వేసిన బంతు లు: 6,017, ఇచ్చిన పరుగులు: 3,023, వికెట్లు: 180, అత్యుత్తమ ప్రదర్శన: 14 పరుగులకు 5 వికెట్లు.
టీ-20 ఇంట్నేషనల్స్
మ్యాచ్‌లు: 2, బ్యాటింగ్: 0, వేసిన బంతులు: 48, ఇచ్చిన పరుగులు: 32, వికెట్లు: 0.