క్రీడాభూమి

అక్టోబర్ వరకూ వేచిచూస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: జింబాబ్వేతో వచ్చే ఏడాది జనవరిలో జరగాల్సిన వనే్డ సిరీస్‌పై అక్టోబర్ వరకూ వేచి చూస్తామని, ఆతర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. అక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్న కారణంగా జింబాబ్వే క్రికెట్ (జెడ్‌సీ)పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెన్షన్ వేటు వేసిన నేపథ్యంలో పలు అంతర్జాతీయ టూర్లు, సిరీస్‌ల పరిస్థితి అయోమయంలో పడింది. జెడ్‌సీపై సస్పెన్షన్ ఎంతకాలం కొనసాగుతుందో తెలియదని, అక్టోబర్ వరకూ వేచిచూసి, అప్పటికీ ఒక కొలిక్కి రాకపోతే తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని బీసీసీఐ వివరించిం ది. టెస్టు హోదాగల జింబా బ్వే పరిస్థితి ఇటీవల కాలం లో దారుణంగా మా రిన విషయం తెలిసిందే. అక్క డి సర్కారు నుంచిగానీ, ప్రజ ల నుంచిగానీ సరైన సహకా రం లేకపోవడంతో, ఆర్థికంగా నష్టపోయింది. చివరికి ఆటగాళ్లతో కాంట్రా క్టు కుదుర్చుకునే స్థాయి కూడా జెడ్‌సీకి లేకుండాపోయింది. ఆర్థిక సంక్షోభం నుం చి బయటపడేందు కు పాకిస్తాన్‌లో సిరీస్‌లు ఆడేందు కు కూడా సిద్ధపడింది. ఇప్పుడు ఏకంగా నిషేధానికి గురికావడం తో, సంక్షోభం తారస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో జింబాబ్వే జట్టు ఇక్కడ టూ ర్‌కు రాకపోవచ్చని అంటున్నా రు. అయితే, బీసీసీఐ మాత్రం వేచిచూసే ధోరణిని ప్రదర్శించాలని నిర్ణయించింది.