క్రీడాభూమి

లంక కోచ్‌లపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జూలై 19: శ్రీలంక క్రికెట్ కోచ్‌లపై వేటు పడింది. జాతీయ క్రికెట్ చీఫ్ కోచ్, ఇతర కోచ్‌లను తొలగించాలని శ్రీలంక క్రీడా శాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో ఆదేశాలు జారీ చేశాడు. ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో లంక దారుణంగా విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో వనే్డ సిరీస్ ఉన్నందున, అది పూర్తయిన వెంటనే హెడ్ కోచ్ చంద్రిక హతురసింఘ, ఇతర కోచ్‌లను తొలగించనున్నట్టు ప్రకటించాడు. నిజానికి ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు ముందు జట్టులో భారీ మార్పులు చేయాలని హతురసింఘ భావించాడు. అయితే, రాజకీయ నాయకులు, ఇతరత్రా ప్రముఖుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో తన నిర్ణయాలను అమలు చేయలేకపోయాడు. శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ)తో తన కాంట్రాక్టు మరో 16 నెలలు ఉందని, ఆతర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. మిగతా వారు కూడా తమతమ కాంట్రాక్టులు పూర్తయ్యే వరకూ కొనసాగుతారని ఆశిస్తున్నట్టు చెప్పాడు. హతురసింఘతోపాటు ఫీల్డింగ్ కోచ్ స్టీవ్ రిక్సన్, బ్యాటింగ్ కోచ్ జాన్ లూయిస్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ రమేష్ రత్నాయకే కాంట్రాక్టు పూర్తికావస్తున్నది. దీనిని పొడిగించే అవకాశాలు లేవని ఎస్‌ఎల్‌సీ అధికారులు అంటున్నారు. ఇలావుంటే, ఏప్రిల్ 21న కొలంబోలో ఆత్మాహుతి దాడులు జరిగిన తర్వాత శ్రీలంక విదేశీ జట్లు ఏవీ పర్యటించలేదు. ఆ సంఘటనలో 258 మంది దుర్మరణం చెందడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగా, ఆ సంఘటన తర్వాత లంకలో క్రికెట్ ఆడేందుకు వస్తున్న మొదటి జట్టు బంగ్లాదేశ్ తన సిరీస్‌ను ఈనెల 26 నుంచి ప్రారంభిస్తుంది. ఆగస్టు ఒకటిన ప్రేమదాస స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో టూర్ ముగుస్తుంది.