క్రీడాభూమి

అదనపు క్రికెటర్ కోసం రూ. 2.4 కోట్లు ఖర్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 16: ఒక క్రికెటర్‌కు సుమారు 2.4 కోట్ల రూపాయలను బిసిసిఐ ఖర్చు చేసింది. ఆశ్చర్యం కలిగించేదైనా ఇది వాస్తవం. వివరాలను బిసిసిఐ తాజాగా తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. ఆ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాలో వనే్డ ట్రై సిరీస్‌లో భారత్ పాల్గొంది. ఆ జట్టులోని ధవళ్ కులకర్ణిని స్వదేశానికి పంపకుండా, వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన 15 మందితో కలిపింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిబంధనలను అనుసరించి ప్రపంచ కప్ పోటీలకు ఎంపికైన 15 మంది ఆటగాళ్లు మాత్రమే బృందంలో ఉండాలి. అదనంగా ఎవరైనా ఉంటే, ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరిగిన నేపథ్యంలో, ధవళ్ కులకర్ణి టీమిండియాతో కలిసి ఉన్నందుకు ఐసిసికి బిసిసిఐ 3,70,111.96 డాలర్లు చెల్లించింది. మారకం విలువను 65.791 రూపాయలుగా తీసుకుంటే, ఈ మొత్తం 2,43,50,036 రూపాయలతో సమానం. 25 లక్షల రూపాయలకు మించి జరిగిన చెల్లింపుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచుతామని బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత శశాంక్ మనోహర్ ప్రకటించాడు. ఈ క్రమంలోనే వివిధ రూపాల్లో బిసిసిఐ చేసిన ఖర్చుల వివరాలను బిసిసిఐ వెబ్‌సైట్‌లో ఉంచుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, 2.4 కోట్ల రూపాయలను ఒక అదనపు ఆటగాడి కోసం బిసిసిఐ చెల్లించింది. అదే విధంగా ఐసిసి ఆధ్వర్యంలోని అవినీతి నిరోధక, భద్రతా విభాగం (ఎసిఎస్) సేవలను వినియోగించుకున్నందుకు మరో 3,80,000 డాలర్లు (2,49,56,500 రూపాయలు) ఇచ్చింది. అనుబంధ చెల్లింపుల కింద వౌలిక సదుపాయాల కల్పన వంటి ఖర్చుల వివరాలను కూడా బిసిసిఐ వెబ్‌సైట్‌లో ఉంచింది. దీని ప్రకారం మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసిఎ) కోసం 11.20 కోట్లు, కర్నాటక క్రికెట్ సంఘానికి 67 లక్షల రూపాయలు చొప్పున చెల్లించింది. ఆంధ్ర క్రికెట్ సంఘం, సౌరాష్ట్ర క్రికెట్ సంఘం చెరి 6.75 కోట్ల రూపాయలను బిసిసిఐ నుంచి పొందాయి. మీడియా హక్కుల అమ్మకాల్లో వాటా కింద, మహారాష్ట్ర క్రికెట్ సంఘానికి 6.7 కోట్ల రూపాయలను బిసిసిఐ ఇచ్చింది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ సంఘానికి ఇదే పద్దు కింద 2.81 కోట్ల రూపాయలు చెల్లించింది. కోవా క్రికెట్ సంఘానికి 5.60 కోట్లు ఇవ్వగా, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన జహీర్ ఖాన్‌కు 81.12 లక్షల రూపాయలు ఇచ్చింది. ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్యకాలానికిగాను ప్రస్తుత క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఉమేష్ యాదవ్, ఆజింక్య రహానే, మురళీ విజయ్, రోహిత్ శర్మలకు మ్యాచ్ ఫీజును, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్‌కు కామెంటరీ ఫీజు కూడా బిసిసిఐ ప్రకటించిన చెల్లింపుల జాబితాలో కనిపించాయి.