క్రీడాభూమి

విండీస్ మాజీ క్రికెటర్ లారాకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 25: వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం ఓ హోటల్‌లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరైన లారా ఒక్కసారిగా మధ్యలోనే ఛాతి నొప్పికి గురయ్యాడు. దీంతో వెంటనే ఆయనను చికిత్స కోసం పరేల్ ప్రాంతలోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ప్రపంచకప్ టోర్నీ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్‌లో విశే్లషణలు అందించేందుకు ముంబయ వచ్చాడు. 50 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ గతంలోనూ గుండెపో టుకు గురైనట్లు తెలుస్తోంది. అయితే గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు లారా ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదల చేయాల్సి ఉంది. కరేబియాన్ జట్టుకు సుదీర్ఘకాలంగా సేవలందించిన లారా మొత్తం 299 వనే్డలాడి, 10,405 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలున్నాయ. ఇక 131 టెస్టులాడిన లారా 11,953 పరుగులు సాధించగా. ఇందులో 34 సెంచరీలు, 48 అర్ధ సెంచరీలుండడం విశేషం. 2004లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 400 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత కామెంటేటర్, విశే్లషకుడిగా కొనసాగుతున్నాడు.