క్రీడాభూమి

భారత్‌ను ఓడిస్తాం : షకీబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్, జూన్ 25: ప్రపంచకప్‌లో అందరి అంచనాలను తలకిందు లు చేస్తూ ఐదో స్థానంలో కొనసాగుతున్న బంగ్లాదేశ్ జట్టు. ఈ నేపథ్యంలో జూలై 2న భారత్‌తో బంగ్లా తలపడనుంది. దాదాపు వారానికి పైగా ఆ జట్టుకు విశ్రాం తి లభింభింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం అనం తరం ఆ జట్టు ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ మీడియాతో మాట్లాడా డు. భారత్‌తో జరిగే మ్యాచ్ మాకు చాలా ముఖ్యం. టైటిల్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన భారత్‌ను ఓడించడం అంత సులువు కాదు. కానీ మేం గట్టి పోటీనిస్తాం. భారత్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లున్నారు. ఒంటిచెత్తో గెలిపించే సత్తా వారికి ఉంది. మాకూ భారత్‌ను ఓడించే సత్తా ఉంది. ఈ విషయంలో జట్టుపై నాకు పూర్తి నమ్మకం ఉందని షకీబ్ ధీమా వ్యక్తం చేశాడు. ఒకే ప్రపంచ కప్‌లో 400 కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు కూడా తీసిన తొలి ప్లేయర్‌గా షకీబ్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ప్రపంచకప్ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించడంతో పాటు ఐదు వికెట్లు తీసిన రెండో స్పిన్నర్‌గా ఘనతను అందుకున్నాడు. 2011 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఈ ఘనత అందుకున్న మొదటి ఆటగాడిగా నిలిచాడు.