క్రీడాభూమి

ఆరోన్ ఫించ్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 25: ప్రపంచకప్‌లో భాగంగా ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఆస్ట్రేలియాను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో డేవిడ్ వార్నర్‌తో కలిసి కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మొదటి నుంచే వీరిద్దరూ ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత వార్నర్ (53) మొయన్ బౌలింగ్‌లో రూట్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 123 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన ఉస్మాన్ ఖాజాతో కలిసి ఫించ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ఖాజా (23) స్టోక్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే సెంచరీ సాధించిన ఫించ్ (100)ను ఆర్చర్ పెవిలియన్‌కు పంపాడు. అప్పటికే క్రీజులో ఉన్న స్టీవ్ స్మిత్ (38) కొద్దిసేపు పోరాడినా, గ్లేన్ మ్యాక్స్‌వెల్ (12), మార్కస్ స్టొయనిస్ (8), ప్యాట్ కమ్మిన్స్ (1) తీవ్రంగా నిరాశ పరిచారు. అయితే వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ (38, నాటౌట్), మిచెల్ స్టార్క్ (4, నాటౌట్)తో కలిసి చివరి వరకు క్రీజులో ఉండడంతో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయ 285 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా, జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్, బెన్ స్టోక్స్, మొయన్ అలీ తలో వికెట్ తీసుకున్నారు. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు 221 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లలో బెన్ స్టోక్స్ (84) మినహా మరెవరూ రాణించకపోవడంతో 64 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ 5 వికెట్లు తీసుకోగా, మిచెల్ స్టార్ 4, మార్కస్ స్టొయనిస్ 1 వికెట్ పడగొట్టారు.

చిత్రం... ఆరోన్ ఫించ్ (100)