క్రీడాభూమి

వాన దేవుడా.. రక్షించు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: భారత్ ఆడాల్సిన ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ గ్రూప్ మ్యాచ్‌లు సజావుగా సాగాలని, వర్షం వల్ల ఎలాంటి ఆటంకం కలగకూడదని అభిమానులే కాదు.. బీమా సంస్థలూ మొక్కుకుంటున్నాయి. వాన దేవుడా.. రక్షించు అంటూ పలు బీమా సంస్థలు వేడుకుంటున్నాయి. ఈసారి ప్రపంచ కప్‌లో ఇంత వరకూ రికార్డు స్థాయిలో నాలుగు మ్యాచ్‌లు రద్దయిన విషయం తెలిసిందే. వీటిలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా ఉంది. కాగా, టీమిండియా ఇంకా నాలుగు గ్రూప్ మ్యాచ్‌లు ఆడాలి. వీటిలో రెండుమూడు మ్యాచ్‌లకు వర్షం బెడద తప్పకపోవచ్చని అంటున్నారు. ఈ వార్త బీమా కంపెనీలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అదే జరిగితే, కనీసం 100 కోట్ల రూపాయల వరకూ చెల్లించాల్సి వస్తుందని బెంబేలెత్తుతున్నాయి. ప్రపంచ కప్‌లో భారత్ ఆడే మ్యాచ్‌లను న్యూ ఇండియా ఎన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఐసీఐసీఐ లాంబార్డ్, జనరల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ వంటి వివిధ బీమా కంపెనీల్లో 150 కోట్ల రూపాయలకు ఇన్సూర్ చేయించారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ని అత్యధికంగా 50 కోట్ల రూపాయలకు బీమా చేయించారు. ఆ మ్యాచ్‌ని కొంత సేపు వర్షం వేధించినప్పటికీ, ఆతర్వాత వాతావరణం అనుకూలించింది. మ్యాచ్ సజావుగా సాగింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ మాత్రం ఒక్క బంతి కూడా బౌల్ కాకుండానే రద్దయింది. మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో రెండుమూడు రద్దయినా, బీమా కంపెనీలు కనీసం 100 కోట్ల రూపాయలను పరిహారం కింద చెల్లించక తప్పని పరిస్థితి. అందుకే, మిగతా మ్యాచ్‌లు సజావుగా జరిపించాలని అభిమానులతోపాటు బీమా కంపెనీలు కూడా వరుణ దేవుడిని ప్రార్థిస్తున్నాయి. ఎవరి గోల వారిది అంటే ఇదేనేమో!
చిత్రం...ఇలాంటి పరిస్థితి పునరావృతమైతే.. బీమా కంపెనీలకు భారీ నష్టమే..