క్రీడాభూమి

కోక-కోలా, మెన్గియూ కంపెనీలకు ఒలింపిక్స్ స్పాన్సర్‌షిప్ హక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాసనే్న, జూన్ 24: కోక-కోలా, చైనాకు చెందిన డైరీ సంస్థ మెన్గియూ 2021 నుంచి 2032 వరకూ జరిగే ఒలింపిక్స్ స్పాన్సర్‌షిప్ హక్కులను సంపాదించాయి. ఈ రెండు కంపెనీలతో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ ప్రకటించాడు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐఓసీ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుందని, అనంతరం ఒప్పందాలపై సంతకాలు కూడా జరిగాయని వివరించాడు. అయితే, ఈ స్పాన్సర్‌షిప్ విలువ ఎంత అనే అంశాన్ని అతను ప్రస్తావించలేదు. ఒప్పందం కుదుర్చుకున్న రెండు కంపెనీలు సైతం ఇంకా వివరణ ఇవ్వలేదు. ఈ రెండు కంపెనీలు ఇప్పటికే ఒలింపిక్ ‘టార్గెట్ ఆఫ్ పోడియం’ (టాప్) కు మద్దతునిస్తున్నాయి. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా, ఎంపిక చేసిన అథ్లెట్లకు శిక్షణ ఇచ్చేందుకు స్పాన్సర్‌షిప్ అందిస్తున్నాయి. అదే తరహాలో 2021 నుంచి మొదలై, 11 సంవత్సరాల పాటు ఒలింపిక్స్‌కు స్పాన్సర్స్‌గా వ్యవహరించే హక్కులను సొంతం చేసుకున్నాయి. ఐఓసీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి.
చిత్రం...థామస్ బాచ్