క్రీడాభూమి

ఇంగ్లీష్ పిచ్‌లపై 350 తక్కువే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి జరిగే ప్రపంచకప్‌లో పరుగుల వరద పరనుంది. ఇంగ్లీష్ పిచ్‌లు ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూ లించడంతో ఈ మెగా టోర్నీలో ఎలాంటి రికార్డులు నమోదవుతాయో చూడాలి. ప్రపంచకప్‌కు ముందు ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌తో ఐదు మ్యా చ్‌ల వనే్డ సిరీస్‌ను ఆడింది. ఇందులో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు 300పై చిలుకు పరుగులను నమోదు చేశాయ. అయతే ఇంగ్లాండ్ జట్టుకు సొంత మైదానాల్లో పట్టుండడంతో పాకిస్తాన్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసింది. గతేడాది ప్రపంచకప్‌లో పసికూన అఫ్గానిస్థాన్‌పై ఆస్ట్రేలియా జట్టు 417 భారీ స్కోరును నమోదు చేసింది. మెగాటోర్నీలో ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ స్కోరు. అంతకుముందు 2007లో బెర్మూడా జట్టుపై టీమిండియా 413 పరుగులు చేసి, ఓవరాల్‌గా రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది. అయతే ప్రస్తుతం హాట్ ఫేవరిట్ జట్లుగా బరిలోకి దిగుతున్న ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్, భారత్, ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లీష్ పిచ్‌లపై మంచి రికార్డున్నా పాకిస్తాన్ జట్టు ఈ ప్రపంచకప్‌లో గత రికార్డులను తుడిచేస్తాయో లేదో చూడాలి.