క్రీడాభూమి

ఊహకందని బంగ్లా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసికూనగా ప్రస్థానం మొదలు పెట్టి.. తన ఆట తీరుతో పెద్ద జట్లను సైతం మట్టికరిపించిన బంగ్లాదేశ్ ఈ ఏడాది మే 30 నుంచి జరిగే ప్రపంచకప్‌లో తామేం తక్కువ కాదంటోంది. మెగా టోర్నీ సాధించడంలో పోటీ జట్లతో హోరాహోరి పోరు తప్పదంటోంది. గ త ప్రపంచకప్‌లో ఎవరూ ఊహించని విధంగా భారత్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి పెద్ద జట్లను మట్టికరి పించిన ఘన చరిత్ర బంగ్లా సొంతం.
1999: ప్రపంచకప్ టోర్నీలోకి అడుగు పెట్టిన బంగ్లాదేశ్ సంచలనమే సృష్టించిందని చెప్పాలి. గ్రూప్ స్టేజీలో మొత్తం ఐదు మ్యాచ్‌లాడిన బంగ్లా స్కాట్‌లాండ్, పాకిస్తాన్‌పై విజయం సాధించింది. న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఈ టోర్నీ మొత్తం 5 పాయంట్లు సాధించింది. అయతే తమకంటే పెద్ద జట్టయన పాకిస్తాన్ మట్టికరిపించడంతో అప్పట్లో బంగ్లా ప్రపంచకప్‌లో సంచలనమే సృష్టిం చిందని చెప్పొచ్చు.
2003: ఆఫ్రికా దేశాలైనా దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో బంగ్లాదేశ్ మొత్తం గ్రూప్ స్టేజీలో 6 మ్యాచ్‌లను ఆడగా, అన్నింట్లోనూ ఓటమి మూటగట్టుకుంది. తనకన్నా చిన్న జట్టయన కెనడా చేతిలోనూ పరాజయం తప్పలేదు.
2007: కరేబియాన్ జట్టు ఆతిథ్యమిచ్చిన ఈ ప్రపంచకప్‌లో బంగ్లా సంచలనం సృష్టించింది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో శ్రీలంకతో మ్యాచ్ ఓడగా, బెర్మూడా, భారత్‌పై విజయాలు సాధించి, నేరుగా సూపర్-8 కు అర్హత సాధించింది. అయతే సూపర్-8లో ఆరు మ్యాచ్‌లాడిన బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో విజయం సాధించి మరో సంచలనం సృష్టించింది. కాగా, మిగతా ఐదు మ్యాచ్‌ల్లో (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, వెస్టిండీస్) పరాజయంతో టోర్నీ నుంచి వెనుదిరిగింది.
2011: ఆసియా దేశాలైన భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్‌పై విజయం సాధించిన బంగ్లాదేశ్ భారత్, వెస్టిండీస్, శ్రీలంకలతో జరిగిన మ్యాచ్‌ల్లో మాత్రం విఫలమైంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోతుందనుకున్న బంగ్లా 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
2015: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చిన మెగా టోర్నీలో బంగ్లాదేశ్ మరోసారి సంచలనం నమోదు చేసింది. గ్రూప్ స్టేజీలో మొత్తం 6 మ్యాచ్ లాడిన బంగ్లా అఫ్గానిస్థాన్, స్కాట్‌లాండ్, ఇంగ్లాండ్‌పై విజయాలు సాధించగా, న్యూజిలాండ్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయంది. అయతే ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియడంతో బంగ్లా జట్టుకు పాయంట్ లభించడంతో క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధించింది. అక్కడ భారత్ చేతిలో 109 తేడాతో ఓటమి చెంది, టోర్నీ నుంచి నిష్క్రమించింది.
చివరగా ప్రపంచకప్‌కు ముందు ఐర్లాండ్ ట్రై నేషన్ సిరీస్ సాధించింది. ఈ సిరీస్‌లో ఆతిథ్య ఐర్లాం డ్, వెస్టిండీస్‌తో మొత్తం నాలుగు మ్యాచ్‌లాడిన బంగ్లా దేశ్ మూడింట విజయం సాధించగా, మరొకటి వర్షం కారణంగా మ్యాచ్ రద్దయంది.
ఓవరాల్‌గా 362 అంతర్జాతీయ వనే్డ మ్యా చ్‌లాడిన బంగ్లాదేశ్ 122 విజయాలను నమోదు చేసింది. ఇందులో 233 మ్యాచ్‌ల్లో ఓడిపోగా, 7 ఫలితం తేలలేదు.
క్రికెట్‌లోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే టెస్టు హోదా ఉన్న అన్ని జట్లను ఓడించిన ఘనతను బంగ్లాదేశ్ దక్కించుకుంది.

అతి తక్కువ స్కోరు..

2003 ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 31.1 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో లంక 10 వికెట్ల తేడాతో విజయం సాధిం చింది. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లంక పేసర్ చమిందా వాస్‌ను రంగంలోకి దించింది. వాస్ తన మొదటి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి హ్యా ట్రిక్ నమోదు చేశాడు. మ్యాచ్ మొత్తంలో 25 పరుగులిచ్చి 6 వికెట్లను నేల కూల్చాడు. వాస్‌కు జతగా స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ మూడు వికెట్లు తీయడంతో బంగ్లా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఓపెనర్లు సనత్ జయసూర్య, మార్వన్ ఆటపట్టు అర్ధ సెంచరీలతో రాణించడంతో వికెట్ నష టపోకుండా విజయం
సాధించింది.

2 బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్‌లు

తేదీ ప్రత్యర్థి జట్టు వేదిక
జూన్ 2 దక్షిణాఫ్రికా లండ న్
జూన్ 5 న్యూజిలాండ్ లండన్
జూన్ 8 ఇంగ్లాండ్ కార్డిఫ్
జూన్ 11 శ్రీలంక బ్రిస్టల్
జూన్ 17 వెస్టిండీస్ టౌంటన్
జూన్ 20 ఆస్ట్రేలియా నాటింగ్‌హామ్
జూన్ 24 అఫ్గానిస్తాన్ సౌతాంప్టన్
జూలై 2 భారత్ బర్మింగ్‌హామ్
జూలై 5 పాకిస్తాన్ లార్డ్స్