క్రీడాభూమి

సౌరవ్ సార్ అభినందన ప్రత్యేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్: సౌరవ్ గంగూలీ అభినందన ఎంతో ప్రత్యేకమైన దని భారత యువ వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషభ్ పంత్ పేర్కొన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ 36 బంతుల్లోనే 78 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించా డు. మ్యాచ్ అనంతరం డగౌట్‌లో కూర్చొని ఉన్న ఢిల్లీ సలహా దారు సౌరవ్ గంగూలీ మైదానంలోకి వచ్చి మరీ పంత్‌ను ఎత్తుకొ ని గాల్లోకి లేపాడు. దీనిపై పంత్ సహచర ఆటగాడు పృథ్వీ షాతో మాట్లాడుతూ గంగూలీ సార్ అభినందన నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అని, ఇదో ప్రత్యేక అనుభూతి అని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 191 పరుగులు చేయగా, ఢిల్లీ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే కేవలం 4 వికెట్లు కోల్పోయ లక్ష్యాన్ని ఛేదిం చింది. ఈ విజయంతో ఢిల్లీ పాయంట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఆ ఆలోచన నన్ను వదలడం లేదు..
ప్రపంచకప్ జట్టు ఎంపిక ఆలోచన ఇంకా నామదిలో ఉంది. ఆ ఆలోచన నన్ను వదలడం లేదు. ప్రస్తుతం నాకేరీర్‌పైనే దృష్టి సారించానని యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చెప్పాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో పంత్ అద్భుతంగా రాణించడంతో ఢిల్లీ విజయం సాధించింది. అనంతరం పంత్ మాట్లాడుతూ ప్రపంచకప్ జట్టు ఎంపిక ఆలోచన ఇంకా తన మదిలో ఉందని, ఆ ఆలోచన నన్ను వదలడం లేదని చెప్పాడు. అయతే పిచ్ అద్భుతంగా ఉండడంతోనే తను రాణించినట్లు పేర్కొన్నాడు.
చిత్రం... రాజస్థాన్‌పై గెలిచిన ఆనందంలో పంత్‌ను ఎత్తుకున్న ఆ జట్టు సలహాదారు సౌరవ్ గంగూలీ