క్రీడాభూమి

గాడిన పడినట్టేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 22: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత 11 సీజన్లలో ఇప్పటివరకు ట్రోఫీని అందుకోలేకపోయింది. ఏ పరిస్థితుల్లోనైనా రాణించే బ్యాట్స్‌మెన్లు, బౌలర్లున్నా ఇప్పటివరకు ఆ కోరిక తీరలేదు. రన్ మెషీన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఎలాంటి షాట్‌నైనా కొట్టగలిగే ఏబీ డివిల్లియర్స్ జట్టుకు కొండంత బలం. ఈ సీజన్‌లో ఎలాగైనా టోర్నీ కొట్టాలని బరి లోకి దిగిన కోహ్లీ సేన మొదటి నుంచి ఓటములను మూట గట్టుకుంది. టోర్నీలో మొదటి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడిన ఆర్సీబీ పూర్తిగా విఫలమైంది. ఈ మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో గెలుపొంది 2019 సీజన్‌లో మొదటి విజయం సాధించింది. ఆ తర్వాత బెంగళూరు వరుసగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై వరుసగా ఆరు మ్యాచ్‌లను ఓడిపోయింది. దీంతో ఈసారి కూడా బెంగళూరు గ్రూప్ స్టేజీ నుంచి వైదొలుగుతుందనే అనుకున్నారంతా.
పంజాబ్‌తో బోణీ..
వరుసగా ఆరు మ్యాచ్‌ల ఓటమి అనంతరం బెంగళూరు కింగ్స్ ఎలెవన్‌పై భారీ విజయం సాధించి, ఈ సీజన్‌లో తొలిసారి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో 173 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లీసేన మరో రెండు బంతులు మిగిలి ఉండగానే, కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయ బోణీ కొట్టింది. సీనియర్ బ్యాట్స్‌మెన్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ (67), ఏబీ డివిల్లియర్స్ (59, నాటౌట్) అద్భుతంగా రాణించారు.
మళ్లీ నిరాశే..
పంజాబ్‌పై గెలిచిన బెంగళూరు ప్లే ఆఫ్ చే రాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి. జట్టులో బ్యాట్స్‌మెన్లు ఫాంలోకి రావడం, బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మిగిలిన మ్యాచుల్లో సత్తా చాటుతామనే ధీమాగా జట్టు కని పించింది. ఈ క్రమంలో ముంబైతో జరిగిన మ్యాచ్లో మళ్లీ తడబ డింది. ఈ మ్యాచ్‌లో ఏబీ డివిల్లియర్స్, మొయన్ అలీ విజృం భించడంతో బెంగళూరు 7 వికెట్లు కోల్పోయ 171 పరుగులు చేసింది. అయతే బౌలింగ్, ఫీల్డింగ్‌లో విఫలమైంది. దీంతో ముంబై 5 వికెట్ల తేడాతో కోహ్లీ సేనపై పైచేయ సాధించింది.
గెలవాలనే కసితో..
ముంబైతో మ్యాచ్ ఓడిన ఆర్సీబీ ప్లే ఆఫ్ వెళ్లడం క్లిష్టమైంది. అటగాళ్లు మాత్రం తమ ప్లే ఆఫ్ అవకాశలు సజీవంగా ఉన్నాయని మిగితా మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్‌కు వెళ్తామని కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌కు ముందు మాట్లాడారు. కోల్‌కతా మ్యాచ్‌లో గెలవాలనే కసితో ఆడిన బెంగళూరు మొదట బ్యాటింగ్ చేపట్టి 4 వికెట్లు కోల్పోయ 213 పరుగుల భారీ స్కోరును ప్రత్యర్థి ముందుంచింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ (100) సెంచరీ సాధించగా, మొయన్ అలీ (66) పరుగులు చేశారు. దీంతో లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన కోల్‌కతా 5 వికెట్లు కోల్పోయ 203 పరుగులు మాత్రమే చేయడంతో బెంగళూరు 10 పరుగుల తేడాతో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 161 స్వల్ప లక్ష్యాన్ని ప్రత్యర్థి, డిఫెండింగ్ ఛాంపియన్ ముందుంచగా అనూహ్యాంగా 1 పరుగు తేడాతో కోహ్లీసేన చివరి బంతికి విజయం సాధించింది. ఇప్పటికే 10 మ్యాచ్ లాడిన బెంగళూరు ఏడింట్లో ఓడి, మూడు మ్యాచ్‌లను గెలిచి 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసా గుతోంది. రెండు వరుస విజయాలతో దూసుకుపోతున్న కోహ్లీసేన గాడిన పడితే ప్లే ఆఫ్‌కు వెళ్లే అవకాశముంది.
ప్లే ఆఫ్‌కు 8 విజయాలు తప్పనిసరా?
మామూలుగా 2019 ఐపీఎల్ సీజన్‌లో ఎనిమిది జట్లు బరిలోకి దిగాయ. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఒక్కో జట్టు మిగతా అన్ని జట్లతో కలిసి మొత్తం 14 మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది. ఇందులో 8 మ్యాచ్‌లను గెలిచిన జట్టు ప్లే ఆఫ్‌కు వెళ్తాయి. అయతే గత సీజన్‌లో రాజస్థాన్ జట్టు 6 పాయంట్లతో ప్లేఆఫ్‌కు చేరాయి. మొత్తం 11 సీజన్లలో నాలుగు సార్లు మాత్రమే ఇలా జరిగింది. ఇప్పుడు ఇదే ఆశతో బెంగళూరు ఆటగాళ్లున్నారు.