క్రీడాభూమి

16 మంది ఉంటేనే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి: ఇంగ్లాండ్‌లో వచ్చేనెలలో ప్రారంభమయ్యే వరల్డ్ కప్‌కు ప్రస్తుతం ఉన్న 15 మంది కాకుండా, 16 మందితో కూడిన బలమైన జట్టు అవసరం ఎంతో ఉందని టీమిండియా కోచ్ రవి శాస్ర్తీ అన్నాడు. బీసీసీఐ తాజాగా ఎంపిక చేసిన వరల్డ్ టూర్ సభ్యుల్లో చోటుదక్కని వారివల్ల నష్టమేమీ లేదని వ్యాఖ్యానించాడు. మే 30 నుంచి ఇంగ్లాండ్‌లో జరిగే వరల్డ్ కప్ మెగా ఈవెంట్‌లో పాల్గొనే 15 మంది జట్టు సభ్యుల్లో యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, సీనియర్ క్రికెటర్ అంబటి రాయుడుకు చోటు దక్కని విషయం తెలిసిందే. ఎంపిక కమిటీని తప్పు పడుతూ పలువురు సీనియర్ క్రికెటర్లు విమర్శలు చేసిన నేపథ్యంలో టీమిండియా కోచ్ రవి శాస్ర్తీ స్పందించాడు. ‘ఈ ఎంపికలో నేను జోక్యం చేసుకోను. దీనిపై ఏమైనా అభిప్రాయముంటే కెప్టెన్ నుంచి తెలుసుకోవాలి’ అని స్పోర్ట్360 అనే వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. ‘కేవలం 15 మందినే జట్టులోకి తీసుకోవాలనుకుంటే కొంతమందికి చోటు దక్కకపోవచ్చు. ఇది అనుకోకుండా జరుగుతుంది. నేనైతే వరల్డ్ కప్‌లో 16 మంది సభ్యులు ఉండాలని కోరుకుంటాను. గతంలో ఇదే విషయమై ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాం’ అని పేర్కొన్నాడు. ‘తుది జట్టులో తమ పేరు లేదని బాధపడేవారు ఎప్పటికైనా తమకు పిలుపువస్తుందని ఆశపడాలి. వారి పేర్లు లేనందువల్ల వచ్చే నష్టమేమీలేదు. వారి వాదన హాస్యాస్పదం. తుది జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో ఎవరైనా గాయపడితే మీకు ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు’ అని రవి శాస్ర్తీ అన్నాడు. గత ఐదేళ్లలో టీమిండియా ఆటతీరును గమనిస్తే ఎంతో అద్భుతంగా రాణిస్తోందని, ఎప్పుడూ రెండు, మూడు స్థానాల్లో నిలుస్తోందని అన్నాడు. గడిచిన రెండు లేదా మూడు లేదా ఐదేళ్లలో వరుసగా చూసుకుంటే టెస్టుల్లో నెంబర్ వన్‌గా, టీ-20లో మూడో స్థానంలో నిలుస్తోందని పేర్కొన్నాడు. అలాగని కేవలం టాప్‌లో చోటుదక్కడం ఏ ఒక్క క్రికెటర్‌పైనే ఆధారపడి ఉండదని, మొత్తం జట్టు సభ్యుల సమష్టి కృషి, పట్టుదల అగ్రపథాన నిలుపుతుందని అన్నాడు.
చిత్రం... రవి శాస్ర్తీ