క్రీడాభూమి

టీమిండియా స్టాండ్‌బైలుగా పంత్, నవదీప్, రాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రెండు రోజుల కిందట ప్రకటించిన వరల్డ్ కప్ టూర్‌లో పాల్గొనే టీమిండియాలో చోటు దక్కని సీనియర్ క్రికెటర్ అంబటి రాయుడు, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తాజాగా స్టాండ్‌బైలు ఎంపికయ్యారు. మే 30 నుంచి ఇంగ్లాండ్‌లో జరిగే ప్రపంచ కప్ టూర్‌లో పాల్గొనే 15 మంది భారత తుది జట్టు సభ్యుల్లో రాయుడు, పంత్‌కు చోటు దక్కకపోవడంతో పలువురు దిగ్గజ క్రికెటర్లు బహిరంగంగానే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయుడు, పంత్‌తోపాటు మూడో క్రికెటర్‌గా ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో జట్టులో ఆడుతున్న ఫాస్ట్‌బౌలర్ నవ్‌దీప్ సైనీని కూడా మెగా ఈవెంట్‌లో స్టాండ్‌బైగా జట్టులోకి బీసీసీఐ తీసుకుంది. వరల్డ్ కప్ టూర్‌కు రిషబ్ పంత్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా, అంబటి రాయుడుని తీసుకోకపోవడం పట్ల మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశ్నించాడు. మెగా ఈవెంట్‌లో పాల్గొనే ఆయా దేశాల జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో బీసీసీఐ తాజాగా టీమిండియా జట్టులోకి అంబటి రాయుడు, రిషబ్ పంత్, నవ్‌దీప్ సైనీలను స్టాండ్‌బైలుగా తీసుకోవాలని నిర్ణయించింది. ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో మాదిరిగానే వరల్డ్ కప్‌లో ముగ్గురు స్టాండ్‌బైలు ఉంటారు. వారిలో రిషబ్ పంత్, అంబటి రాయుడు మొదటి, రెండు స్థానాల్లోనూ, బౌలర్ల జాబితాలో నవ్‌దీప్ సైనీ ఉంటాడు. బీసీసీఐ ఎంపిక చేసిన తుది జట్టులో ఎవరైనా గాయపడితే ఈ ముగ్గురు ఆటగాళ్లను అవసరానికి అనుగుణంగా బరిలోకి దింపుతారు’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు బుధవారం పీటీఐ ప్రతినిధికి తెలిపారు.
ఇదిలావుండగా, వరల్డ్ కప్ టూర్‌కు బీసీసీఐ సోమవారం ఎంపిక చేసిన తుది జట్టులో తనను మినహాయించడంతో అసంతృప్తికి గురైన హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడు మంగళవారం ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ‘వరల్డ్ కప్‌ను చూసేందుకు ఇప్పుడే త్రీడీ గ్లాసుల కోసం ఆర్డర్ ఇచ్చాను’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. మెగా ఈవెంట్‌కు తనకు చోటు దక్కకుండా తమిళనాడు క్రికెటర్, ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కు సెలక్షర్ల కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ బెర్త్ ఖరారు చేసిన నేపథ్యంలో రాయుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగించాయి. ఇదిలావుండగా, టీమిండియాకు ఎంపిక చేసిన తుది జట్టులో చోటు దక్కకున్నా ఖలీల్ అహమ్మద్, అవేష్ ఖాన్, దీపక్ చహర్ నెట్ బౌలర్లుగా వ్యవహరిస్తారు. అయితే, వీరంతా స్టాండ్‌బై ఆటగాళ్లు కాదు. అయితే, ‘ఖలీల్ అహమ్మద్, అవేష్ కాన్, దీపక్ చహర్ స్టాండ్‌బైలుగా కాకపోవడం, బౌలర్లు కావడంతో బ్యాట్స్‌మెన్‌లు అవసరమైన పక్షంలో రిషబ్ పంత్ లేదా రాయుడికి చాన్స్ లభించే అవకాశం ఉంది’ అని బీసీసీఐ సీనియర్ అధికారి పేర్కొన్నాడు. ఇదిలావుండగా, వరల్డ్ కప్‌కు ఎంపికైన టీమిండియా జట్టులోని ఆటగాళ్లు ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొంటున్న నేపథ్యంలో వారికి యోయో టెస్టు నిర్వహించే ఆస్కారం లేదు. వీరంతా మే 12న ముగిసే ఐపీఎల్ మ్యాచ్ తర్వాత ఇంగ్లాండ్ టూర్‌కు సన్నద్ధమవుతారు.
చిత్రం... కీపర్ రిషబ్ పంత్