క్రీడాభూమి

కార్తీక్ ఇన్.. పంత్ ఔట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్లు.. ఇద్దరు వికెట్ కీపర్లు.. ముగ్గురు పేసర్లు.. మరో ముగ్గురు ఆల్‌రౌండర్లు.. ఇద్దరు స్పిన్నర్లు .. ఇదీ మే 30 నుంచి ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా ప్ర తిష్టాత్మకంగా నిర్వహించే ప్రపంచ క్‌ప్ టోర్నీ లో తలపడే భారత జట్టు. సోమ వారం ముంబయలోని బీసీసీఐ క్రికెట్ సెంటర్‌లో సమావేశమైన సీఓఏ (కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేష న్) ఎమ్మె స్కే ప్రసాద్ నేతృత్వంలో ని సెలక్షన్ కమిటీతో చర్చించి జట్టును ప్రకటిం చింది. ఈ సమావేశానికి జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధా న కోచ్ రవిశాస్ర్తితో పాటు పలువు రు అధికారు లు హాజరయ్యారు.
పంత్‌కు బదులు కార్తీక్..
సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టులో రెండో వికెట్ కీపర్ (బ్యాకప్ కీపర్)గా యువ సంచలనం రిషభ్ పంత్‌కు చోటు దక్కుతుం దని భావించారంతా కానీ సెలక్షన్ కమిటీ పంత్‌కు బదులు సీనియర్ ఆటగాడు దినేష్ కార్తీక్‌ను ఎంపిక చేసింది. పంత్‌కు ఆస్ట్రేలియా తో స్వదేశంలో జరిగిన సిరీస్‌కు అవకాశాలు కల్పించడంతో అందరూ ప్రపంచకప్ జట్టులో ఆడతాడనే ఊహాగానాలు వినిపించాయ. అనూ హ్యాంగా కార్తీక్‌కు చోటు కల్పించడంతో పంత్ అభిమానులు నిరాశ చెందారు.
రాయుడు, రహానేకు నిరాశే..
గత కొద్ది రోజులుగా టీమిండియాలో నాలుగో స్థానంపై సందిగ్ధత నెలకొన్న విష యం తెలిసిందే. దీంతో ప్రపంచకప్ జట్టును సిద్ధం చేయడంలో బీసీసీఐ ఆలోచనలో పడింది. అందుకు అనుగుణంగానే అంబటి రాయుడు, అజింక్యా రహానే వంటి ఆటగాళ్లకు చోటు కల్పిచింది. అయతే వీరిద్దరూ పలు సిరీస్‌ల్లో విఫలమయ్యారు. ప్రస్తుతం ఈ సీజన్ ఐపీఎల్‌లోనూ వీరి ప్రదర్శన దారుణంగానే ఉండడంతో సెలక్షన్ కమిటీ వీరిపై మొగ్గు చూపలేదన్నట్లు తెలుస్తోంది.

కేఎల్ రాహుల్ లక్కీ..
కేఎల్ రాహుల్ ‘కాఫీ విత్ కరణ్ షో’లో భాగంగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆస్ట్రేలియా టూర్‌లో ఉండగానే అర్ధంతరంగా సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జట్టులో చోటు కోసం శ్రమించాల్సి వచ్చింది. అయతే స్వదేశంలో అ దే ఆసీస్‌తో జరిగిన టీ20లో రాహుల్ తన దైన శైలిలో ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో నూ అద్భుతంగా రాణిస్తూ సెలక్టర్ల చూపులో పడ్డాడు. మరోవైపు చాలా రోజులుగా రిజర్వ్ ఓపెనర్‌గా ఎవరనే దానికి సెలక్టర్లకు రాహుల్ కంటే మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు.
ఇక విజయ్ శంకర్, కేదార్ జాదవ్, రవీం ద్ర జడేజాలను సెలక్షన్ కమిటీ జట్టులోకి తీసుకుంది. గత కొద్ది కాలంగా విజయ్‌శంక ర్, జాదవ్‌లు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. అయతే సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా ఎంపికపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్ మినహా జడేజా ప్రదర్శన ఎక్కడా సంతృప్తిగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయ. మరోవైపు నాలుగో పేసర్‌గా ఆశలు పెట్టుకున్న సీనియర్ బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లకు జట్టులో చోటు దక్కలేదు.

నెం.4 ఎవరు?
సెలక్షన్ కమిటీ ప్రకటించిన టీమిండియా జట్టులో నెం.4లో ఎవరు ఆడతారనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కేఎల్ రాహుల్‌ను రిజర్వ్‌డ్ ఓపెనర్‌గా ప్రకటించడంతో మళ్లీ కథ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది. ఒకవేళ రాహుల్‌ను తుది జట్టులోకి తీసుకుంటే విరాట్ కోహ్లీ ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడనే సందిగ్ధత నెలకొంది. రాహుల్‌ను కాకుండా ఆ స్థానంలో విజయ్‌శంకర్‌ను ఆడి స్తారా? అనేది చూడాలి. అయతే కోహ్లీ మూడో స్థానంలో కాకుండా మరే స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా అది ఆటపై ప్రభావం పడుతుందని, రాహుల్‌కు తుది జట్టులో జట్టులో అవకాశం కల్పిచకుంటే ఆ స్థానంలో విజయ్ శంకర్ తప్ప ప్రత్యామ్నాయం లేదంటున్నారు క్రికెట్ విశే్లషకులు.

ధోనీ గాయపడితేనే..?
రెండో వికెట్ కీపర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న దినేష్ కార్తీక్ ఒకవేళ ధోనీ గాయపడితేనే తుది జట్టులోకి వస్తాడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. ధోనీ ఒత్తిడిని తట్టుకొని అద్భుతంగా రాణించగలు గుతాడని పేర్కొన్నాడు. మరోవైపు పంత్‌ను ఎందుకు జట్టులోకి తీసుకోలేదో కారణం చెప్పాడు. ఒకవేళ ధోనీ గాయపడితే రెండో కీపర్‌గా దినేష్ కార్తీక్ లేదా పంత్‌లో ఎవరినో ఒకరిని తీసుకోవాలనుకున్నాం. అయతే అది కీలక మ్యాచ్ అయతే ఏంటి అనే దానిపై ఆలోచించి కార్తీక్‌ను తీసుకున్నట్లు స్పష్టం చేశాడు.
చిత్రం...భారత ప్రపంచకప్ జట్టు ఇదే..