క్రీడాభూమి

ప్రయోగమే దెబ్బతీసిందా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాతో వనే్డ సిరీస్ ఓటమికి టీమిండియా చేసిన ప్రయోగమే కారణమా? ఈ సందేహం క్రికెట్ విశే్లషకులతో పాటు అభిమానుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రపంచకప్ 2019కు ముందు చేసి ఈ ప్రయోగం జట్టును దారుణంగా దెబ్బతీసింది. ఎంతగా అంటే 2017 తర్వాత ఒక్క వనే్డ సిరీస్‌నూ గెలవని ఆస్ట్రేలియా ఏకంగా నెం.2 ర్యాంకింగ్ ఉన్న కోహ్లీ సేనను ఓడించేలా చేసింది. అసలు భారత జట్టు స్వదేశంలో జరిగిన వనే్డ సిరీస్‌లో ఎందుకు ప్రయోగం చేయాలనుకుంది? ఒక్కసారి వెనక్కి వెళ్దాం..
న్యూఢిల్లీ, మార్చి 14: ఆస్ట్రేలియా పర్యటనను చారిత్రాత్మక విజయంతో ముగించిన భారత జట్టు ప్రపంచకప్‌కు ముందు అదే జట్టుతో స్వదేశంలో టీ20, వనే్డ సిరీస్‌కు ఆహ్వానించింది. ఇక్కడే జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచనలో పడింది. గత కొన్నాళ్లు గా జట్టులో నెం.4 స్థానంలో ఆడుతున్న బ్యాట్స్‌మెన్లంతా విఫలం కావడంతో ప్రపంచకప్‌కు ముందు కొద్దిపాటి ప్రయోగాలతో ఆ లోటును భర్తీ చేసేందుకు పూనుకుంది. ఇదే సమయంలో ఓపెనింగ్ సమస్య కూడా వెంటాడుతుండడంతో ఈ రెండింటిపై దృష్టి సారించి, ఆస్ట్రేలియాతో జరిగే టోర్నీలో ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది.
రెండు సిరీస్‌లలో కుర్రాళ్లకు ఛాన్స్..
ఆస్ట్రేలియాతో జరిగిన ఈ టోర్నీలో భారత్ టీ20, వనే్డ సిరీస్‌లో కొత్త కుర్రాళ్లకి చోటిచ్చి ప్రయోగం మొదలు పెట్టింది. మొదట టీ20 సిరీస్‌లో రెగ్యూలర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను తప్పించి, లోకేష్ రాహుల్‌ను తుది జట్టులో తీసుకుంది. ఈ సిరీస్ రాహుల్ రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుతంగా రాణించాడు. పైగా ఓ అర్ధ సెంచరీ కూడా సాధించాడు. ఇక బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌కి మరోసారి అవకాశం కల్పించగా, సిద్ధార్థ్ కౌల్, మయాంక్ మార్కండేతో పాటు యువ ఆల్‌రౌండర్లు కృణాల్ పాండ్య, విజయ్ శంకర్‌కు తుది జట్టు లో చోటు కల్పించారు. అయతే కృనాల్ పాండ్య, విజయ్‌శంకర్ ఆకట్టుకోగా, మిగతా వారంతా నిరాశ పరిచారు. రిషభ్ పం త్, దినేష్ కార్తీక్‌కు అవకాశమిచ్చినా ఆకట్టుకోలేకపోయారు. ఫలితంగా టీ20 సిరీస్‌ను భారత్ 0-2తో కోల్పోయంది.
వనే్డల్లో మరీ దారుణంగా..
ఇక టీ20 సిరీస్ కోల్పోయన టీమిండియా వనే్డ సిరీస్‌లో కొద్దిపాటి మార్పులతో బరిలోకి దిగింది. లోకేష్ రాహుల్‌ని పక్కనపెట్టడంతో వనే్డలో రెగ్యూలర్ ఓపెనర్ శిఖర్ ధావన్ తుది జట్టులో చేరాడు. నాలుగో మ్యాచ్ మినహా ఆడిన అన్ని మ్యాచ్ ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఇక రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విజయ్ శంకర్, రిషభ్ పంత్ (చివరి రెండు వనే్డల్లో) ఆకట్టుకునే ప్రదర్శనే చేయలేదు.
ఎవరొచ్చినా అంతే..
నాలుగో స్థానం భారత జట్టును గత కొంతకాలంగా వేధిస్తు న్న ప్రధాన సమస్య. ఈ సిరీస్‌లో హైదరాబాద్ ఆటగాడు అంబ టి రాయుడుని నాలుగో స్థానంలో ఆడించగా దారుణంగా విఫ లమయ్యాడు. దీంతో మధ్యలోనే తప్పించి, ఆ స్థానంలో చివరి రెండు వనే్డలకు రిషభ్ పంత్ వచ్చినా మార్పేమీ లేకపోయంది.
ప్రయోగంపై విమర్శలు..
ఇదిలాఉంటే ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు చేస్తున్న ప్రయోగాలపై మాజీలు, క్రికెట్ విశే్లషకులు, అభిమానులు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్‌కు ముందు చేస్తున్న ఈ ప్రయోగాలను చెత్త ప్రయోగాలుగా అభివర్ణిస్తున్నారు. ఇక కొం దరైతే నేరుగా కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్ర్తిలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాల్లో ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు కెప్టెన్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ ఓటమికి, ప్రయోగానికి సంబంధం లేదని స్పష్టం చేశాడు. దీనితో పాటు ప్రపంచకప్ జట్టు కూర్పులో ఒక స్థానం మినహా, ఎలాంటి సమస్యల్లేవని దీనిని సరిదిద్దుకొని ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్తామని తెలిపాడు.