క్రీడాభూమి

మూడో అతిపెద్ద గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్ ఓవల్: వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్ 364 పరుగులు చేసి, సాధించిన విజయం వనే్డ ఇంటర్నేషనల్స్ అతిపెద్ద ఛేజింగ్ విజయాల్లో మూడోది. 2006లో ఆస్ట్రేలియా చేసిన 435 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 438 పరుగులు చేసి, ఛేదించింది. ఇప్పటి వరకూ ఇదే అతి పెద్ద రికార్డు విజయం. పదేళ్ల తర్వాత, 2016లో, ఆస్ట్రేలియాతోనే కింగ్స్‌మెడ్‌లో జరిగిన వనే్డలో దక్షిణాఫ్రికా ఘన విజయాన్ని నమోదు చేసింది. 372 పరుగుల లక్ష్యాన్ని సమర్థంగా పూర్తి చేసింది. ఛేజింగ్ భారీ విజయాల్లో మొదటి రెండు స్థానాలను దక్షిణాఫ్రికానే సొంతం చేసుకోవడం విశేషం. తాజాగా మూడో స్థానాన్ని ఆక్రమించిన ఇంగ్లాండ్ 361 పరుగుల లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది.
ఛేజింగ్‌లో ‘టాప్-10’
1. దక్షిణాఫ్రికా (12 మార్చి 2006/ ఆస్ట్రేలియాపై/ న్యూ వాండరర్స్ స్టేడియంలో/ లక్ష్యం 435/ స్కోరు 438), 2. దక్షిణాఫ్రికా (5 అక్టోబర్ 2016/ ఆస్ట్రేలియాపై/ కింగ్స్‌మెడ్‌లో/ లక్ష్యం 372/ స్కోరు 372), 3. ఇంగ్లాండ్ (20 ఫిబ్రవరి 2019/ వెస్టిండీస్‌పై/ కింగ్‌స్టన్ ఓవల్‌లో/ లక్ష్యం 361/ స్కోరు 364), 4. భారత్ (16 అక్టోబర్ 2013/ ఆస్ట్రేలియాపై/ జైపూర్ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో/ లక్ష్యం 360/ స్కోరు 364), 5. భారత్ (30 అక్టోబర్ 2013/ ఆస్ట్రేలియాపై/ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో/ లక్ష్యం 351/ స్కోరు 351), 6. భారత్ (15 జనవరి 2017/ ఇంగ్లాండ్‌పై/ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో/ లక్ష్యం 351/ స్కోరు 356), 7. ఇంగ్లాండ్ (17 జూన్ 2015/ న్యూజిలాండ్‌పై/ ట్రెండ్ బ్రిడ్జ్. లక్ష్యం 350/ స్కోరు 350), 8. న్యూజిలాండ్ (20 ఫిబ్రవరి 2007/ ఆస్ట్రేలియాపై/ సెడన్ పార్క్‌లో/ లక్ష్యం 347/ స్కోరు 350), 9. న్యూజిలాండ్ ( 17 ఫిబ్రవరి 2007/ ఆస్ట్రేలియాపై/ కోల్‌కతా ఈడెన్ పార్క్‌లో/ లక్ష్యం 337/ స్కోరు 340), 10. న్యూజిలాండ్ (6 మార్చి 2018/ ఇంగ్లాండ్‌పై/ యూనివర్శిటీ ఓవల్/ లక్ష్యం 336/ స్కోరు 339).
సంక్షిప్త స్కోర్లు
వెస్టిండీస్: 50 ఓవర్లలో 8 వికెట్లకు 360 (క్రిస్ గేల్ 135, షాయ్ హోప్ 64, డారెన్ బ్రేవో 40, బెన్ స్టోక్స్ 3/37, అదిల్ రషీద్ 3/74, క్రిస్ వోక్స్ 2/59).
ఇంగ్లాండ్: 48.4 ఓవర్లలో 4 వికెట్లకు 364 (జాసన్ రాయ్ 123, జో రూట్ 102, ఇయాన్ మోర్గాన్ 65, జాసన్ హోల్డర్ 2/63).

చిత్రం.. మెరుపు శతకంతో ప్రేక్షకులను అలరించిన విండీస్ స్టార్ క్రిస్ గేల్