క్రీడాభూమి

బీసీసీఐపై పరస్పరం విమర్శలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: మనస్పర్థలు, విబేధాలపై బహిరంగ ప్రకటనలు చేయరాదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) యాజమాన్య ప్రతినిధులను సుప్రీంకోర్టు ఆశించింది. బీసీసీఐకు చెందిన వారు పరస్పరం అభియోగాలు చేసుకోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బీసీబీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ చీఫ్ వినోద్ రాయ్, సభ్యులు డయానా ఎడుల్జీ పరస్పరం విమర్శించుకున్న సంగతి విదితమే. జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ ఎఎం సప్రేతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్‌లో మరో ముగ్గురు సభ్యులను నియమించనున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. గతంలో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్‌లో నలుగురు సభ్యులు ఉండేవారు. ఇందులో చరిత్రాకారుడు రామచంద్ర గుహ , బ్యాంకర్ బిక్రమ్ లిమయే అనే ఇద్దరు సభ్యులు కమిటీ నుంచి వైదొలిగారు. సభ్యులెవరూ విమర్శలు చేసుకోరాదని కోర్టు స్పష్టం చేసింది. బీసీసీఐ ఎదుర్కొంటున్న సమస్యలు తమకు తెలుసని కోర్టు పేర్కొంది.