క్రీడాభూమి

మళ్లీ కంగారులతో ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌కు ముందు టీమిండియా మరోసారి కంగారులను ఢీకొనబోతుంది! అయతే ఈసారి స్వదేశంలోనే కావడంతో భారత జట్టు మరింత బలం ప్రదర్శించే అవకాశముంది! ఇప్పటికే టీమిండియా ఆస్ట్రేలియాను వారి దేశంలో ఓడించి గత చరిత్రలను తిరగరాసింది! మరోవైపు వరుస వివాదా లతో ఇప్పుడిప్పుడే బయటపడ్డ ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లో సత్తా చాటి ప్రపంచ క్రికెట్‌కు తమదింకా ప్రమాదకర జట్టేనేని నిరూపించుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది! ఈ ఏడాది మే నుంచే ప్రారంభం కానున్న ప్రపంచకప్ 2019కు ముందు భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే టోర్నీ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తింపుకోనుంది!
‘చారిత్రక’ ఊపు..
గతేడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్ నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలుచుకున్న తొలి ఆసియా దేశంగా భారత జట్టు చరిత్ర సృష్టించింది. అలాగే మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌నూ 2-1తో గెలుచుకుంది. దీంతో ఆసీస్ గడ్డపై ఆడిన రెండు ఫార్మాట్‌లలో సిరీస్ కోల్పోని తొలి ఆసియా దేశంగా టీమిండియా రికార్డు నెలకొల్పిం ది. అడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో 31 పరుగులతో గెలిచిన భారత్, రెండో టెస్టులో మాత్రం ఓడింది. పెర్త్ లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 146 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక మూడో టెస్ట్‌లో టీమిండి యా 137 పరుగుల తేడాతో గెలిచి 2-1తో ముందు వరుసలో నిలిచినా, చివరి సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ వెలుతురు లేమి కారణంగా డ్రాగా ముగిసింది. దీంతో భారత్ ఖాతాలో చారిత్రాక విజయం నమోదైంది. అయతే ఈ నెల 24 నుంచి మార్చి 13 వరకు జరిగే టోర్నీ స్వదేశంలో జరగడంతో భారత్‌కు అనుకూలించే అంశం. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఎలా ప్రతిఘటిస్తుంద నేది చూడాలి. ఇలా ఉంటే కంగారుల గడ్డపై వారిని ఓడించిన భారత జట్టు మాత్రం న్యూజిలాండ్‌తో జరిగి న టీ20 సిరీస్ ఓడినా దీమాగానే కనిపిస్తోంది.
శ్రీలంకపై గెలిచిన ఉత్సాహంతో..
భారత్‌తో సొంత గడ్డపై టెస్టు, వనే్డ సిరీస్‌లో ఘోర పరాభవాన్ని చూసిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో విజయం సాధించి ఊపు మీదుంది. ఎలాగైనా భారత్‌ను వారి స్వదేశంలోనే ఓడిం చి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
అందరి దృష్టి ఈ టోర్నీ పైనే..
భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా ప్రపంచకప్ ముందు బలమైన జట్టును ఎలా ఢీకొనబోతుందనేది ఆసక్తిగా మారింది. గత పర్యటనలో టీమిండియా కంగారులను వారి గడ్డపైనే ఓడించి పైచేయ సాధించగా, రానున్న టోర్నీలో, అందులో ప్రపంచకప్‌కు ముందు పర్యాటక జట్టు బలమైన భారత్‌ను ప్రతిఘటిస్తుందో చూసేందుకు ప్రపంచ క్రికెట్ దృష్టి ఈ టోర్నీపైనే ఉంది. ఇదిలాఉంటే వివాదాలతో వరుస ఓటములను ఎదు ర్కొంటున్న ఆస్ట్రేలియాకు మాజీల మద్దతు దొరికింది. దీంతో టీమిండియా పర్యటనను విజయవంతంగా ముగించి ప్రపంచ క్రికెట్‌లో తమ సత్తా మరోసారి నిరూ పించేందుకు కంగారులు రెఢీ అవుతున్నారు.
భారత్ పర్యటనకు వచ్చే ఆస్ట్రేలియా జట్టు..
టీ20 జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, డీఆర్సీ షార్ట్, మార్కస్ స్టొయనిస్, ప్యాట్ కమ్మిన్స్, గ్లెన్ మాక్స్‌వెల్, జే రిచర్డ్‌సన్, కానె రిచర్డ్‌సన్, నాథన్ కౌల్టర్-నైల్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, జాసన్ బెహ్రెన్‌డ్రఫ్, నాథన్ లియాన్, అస్టన్ టర్నర్, ఆడం జంపా.
వనే్డ జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, డీఆర్సీ షార్ట్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, మార్కస్ స్టొయనిస్, గ్లెన్ మాక్స్‌వెల్, జే రిచర్డ్‌సన్, అస్టన్ టర్నర్, ప్యాట్ కమ్మిన్స్, కానె రిచర్డ్‌సన్, నాథన్ కౌల్టర్-నైల్, జాసన్ బెహ్రెన్‌డ్రఫ్, నాథన్ లియాన్, ఆడం జంపా.

ట్రోఫీతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (ఫైల్)

*ఆస్ట్రేలియాతో వనే్డ సిరీస్ గెలిచిన ఆనందంలో భారత జట్టు ఆటగాళ్లు (ఫైల్)