క్రీడాభూమి

ముంబయి, పుణె మ్యాచ్‌కి బాంబే హైకోర్టు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 20: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా మే ఒకటిన ముంబయి ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కి బాంబే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 30వ తేదీ తర్వాత మహారాష్టల్రో ఐపిఎల్ మ్యాచ్‌లను నిర్వహించరాదని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)కు కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, పుణెలో గుజరాత్ లయన్స్‌తో రైజింగ్ పుణె జట్టు ఈనెల 29న మ్యాచ్ ఆడాల్సి ఉందని, మే ఒకటిన మహారాష్టల్రో కాకుండా మరో ప్రాంతంలో మ్యాచ్ ఆడేందుకు తగినంత సమయం ఉండదని కోర్టుకు బిసిసిఐ విన్నవించింది. కాబట్టి ఆ రోజున జరగాల్సిన మ్యాచ్‌కి అనుమతించాలని కోరింది. బోర్డు అభ్యర్థనపై స్పందించిన బాంబే హైకోర్టు మే ఒకటో తేదీన పుణెలో మ్యాచ్‌కి అనుమతినిచ్చింది. మహారాష్టల్రోని ముంబయి, నాగపూర్, పుణె నగరాల్లో ఫైనల్‌సహా మొత్తం 20 మ్యాచ్‌లను ఐపిఎల్ నిర్వాహణ కమిటీ కేటాయించింది. అయితే, మహారాష్టల్రో కరవు తాండవిస్తూ, చాలా ప్రాంతాల్లో తీవ్రనీటి ఎద్దడి కొనసాగుతుంటే ఐపిఎల్ మ్యాచ్‌ల కోసం 60 నుంచి 70 లక్షల లీటర్ల నీటిని వాడడం సమంజసం కాదని లోక్‌సత్తా మూమెంట్ బాంబే హైకోర్టులో పిల్‌ను దాఖలు చేసింది. వెంటనే ఈ మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించాల్సిందిగా బిసిసిఐని ఆదేశించాలని కోరింది. ఈ పిటిషన్‌పై వాదోపవాదాలు కొనసాగాయి. ఇప్పటికే టికెట్లు అమ్మేశామని, ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నామని, హఠాత్తుగా మరో ప్రాంతానికి మ్యాచ్‌లను తరలించడం సులభ సాధ్యం కాదని బిసిసిఐ చేసిన విజ్ఞప్తిపై కోర్టు పాక్షికంగా స్పందించింది. ఈనెల 30వ తేదీలోగా జరగాల్సిన మ్యాచ్‌లను నిర్వహించుకోవచ్చని కోర్టు అనుమతించింది. ఆతర్వాత జరగాల్సిన మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించాల్సిందిగా ఆదేశించింది. అయితే, సమయాభావం కారణంగా మే ఒకటిన జరగాల్సిన మ్యాచ్‌ని తరలించడం పుణె జట్టుకు సాధ్యం కాదని బోర్డు మొరపెట్టుకుంది. కనీసం ఆ మ్యాచ్‌ని నిర్వహించేందుకు అనుమతించాలని కోరింది. ఈ విజ్ఞప్తిని కూడా బాంబే కోర్టు మన్నించింది.

మే ఒకటో తేదీ తర్వాత మహారాష్ట్ర నుంచి తరలిపోవాల్సిన మ్యాచ్‌లు..
1. మే 7: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్/ ఢిల్లీ డేర్‌డెవిల్స్ (నాగపూర్‌లో)
2. మే 8: ముంబయి ఇండియన్స్/ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ముంబయిలో)
3. మే 9: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్/ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (నాగపూర్‌లో)
4. మే 10: రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్/ సన్‌రైజర్స్ హైదరాబాద్ (పుణెలో)
5. మే 13: ముంబయి ఇండియన్స్/ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (ముంబయిలో)
6. మే 15: ముంబయి ఇండియన్స్/ ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ముంబయిలో)
7. మే 15: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్/ సన్‌రైజర్స్ హైదరాబాద్ (నాగపూర్‌లో)
8. మే 17: రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్/ ఢిల్లీ డేర్‌డెవిల్స్ (పుణెలో)
9. మే 21: రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్/ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (పుణెలో)
10. మే 25: ఎలిమినేటర్ (పుణెలో), 11. మే 27: క్వాలిఫయర్-2, 12. మే 29: ఫైనల్.
(వీటిలో పుణెలో జరగాల్సిన మూడు మ్యాచ్‌లను విశాఖపట్నంలో ఆడేందుకు రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ అంగీకరించింది. మే 10న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో, 17న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో, 21న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో ఈ జట్టు పుణెలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ఈమూడు మ్యాచ్‌లకు విశాఖ పట్నం వేదిక కానుంది).