క్రీడాభూమి

రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 20: రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ముంబయి ఇండియన్స్‌కు ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ఐపిఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లో పరాజయాన్ని ఎదుర్కొన్న డిఫెండింగ్ చాంపియన్ ముంబయికి మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని అందించాడు. 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో 62 పరుగులు సాధించిన అతను కీలకపాత్ర పోషించాడు. చివరిలో కీరన్ పోలార్డ్ (19 బంతుల్లో 40 నాటౌట్) విజృంభించడంతో, మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ముంబయి విజయభేరి మోగించింది.
ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా బెంగళూరు ఇన్నింగ్స్‌ను కెప్టెన్ విరాట్ కోహ్లీ, లోకేష్ రాహుల్ ఆరంభించి, మొదటి వికెట్‌కు 32 పరుగులు జోడించారు. టెస్టు క్రికెటర్‌గా ముద్రపడిన రాహుల్ 14 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 23 పరుగులు సాధించి మిచెల్ మెక్‌క్లీనగన్ బౌలింగ్‌లో హర్భజన్ సింగ్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. 32 పరుగుల వద్ద తొలి వికెట్ కూలగా, 91 పరుగుల స్కోరువద్ద కోహ్లీ అవుటయ్యాడు. అతను 30 బంతుల్లో, మూడు ఫోర్లతో 33 పరుగులు చేసి కృణాల్ పాండ్య బౌలింగ్‌లో టిమ్ సౌథీకి చిక్కాడు. హార్డ్ హిట్టర్ ఎబి డివిలియర్స్ 21 బంతుల్లో 29 పరుగులు సాధించి కృణాల్ పాండ్య బౌలింగ్‌లో క్రీజ్ బయటకు వచ్చి బంతిని బలంగా కొట్టే ప్రయత్నంలో విఫలమై పార్థీవ్ పటేల్ స్టంప్ చేయడంతో పెవిలియన్ చేరాడు. అతని స్కోరులో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ కేవలం ఐదు పరుగులు చేసి జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పార్థీవ్ పటేల్ క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. ఐపిఎల్‌లో తొలి మ్యాచ్ ఆడిన ట్రావిస్ హెడ్ 24 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 37 పరుగులు సాధించి, అనవసరంగా ఓ పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. యువ బ్యాట్స్‌మన్ సర్ఫ్‌రాజ్ ఖాన్ 18 బంతుల్లో 28 పరుగులు చేసి చివరి చివరి వర్ నాలుగో బంతికి అవుటయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో అతను ఇచ్చిన క్యాచ్‌ని కృణాల్ పాండ్య ఒడిసి పట్టుకున్నాడు. తర్వాతి బంతికే స్టువర్ట్ బిన్నీ కూడా వెనుదిరిగాడు. అతని క్యాచ్‌ని హార్దిక్ పాండ్య అందుకున్నాడు. చివరి బంతికి కేన్ రిచర్డ్‌సన్ ఒక పరుగు చేయగా, హర్షల్ పటేల్‌కు ఒక్క బంతిని ఎదుర్కొనే అవకాశం కూడా రాలేదు. బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేయగలిగింది.
బ్యాటింగ్ బలంపై అపారమైన నమ్మకంతో ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబయి 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగి, ఆరు పరుగుల స్కోరువద్ద మొదటి వికెట్‌ను పార్థీవ్ పటేల్ రూపంలో చేజార్చుకుంది. అతను ఐదు పరుగులు చేసి కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో ఎబి డివిలియర్స్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. ఊహించని ఎదురుదెబ్బతో కంగుతిన్న ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ దిద్దుబాటు చర్యలు తీసుకున్నాడు. ఫస్ట్‌డౌన్ ఆటగాడు అంబటి రాయుడుతో కలిసి జాగ్రత్తగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. వీరు రెండో వికెట్‌కు 9.1 ఓవర్లలో 76 పరుగులు జోడించారు. 23 బంతుల్లో, ఐదు ఫోర్ల సాయంతో 31 పరుగులు చేసిన రాయుడును కేన్ రిచర్డ్‌సన్ క్యాచ్ అందుకోగా ఇక్బాల్ అబ్దుల్లా అవుట్ చేశాడు. జట్టుకు అండగా నిలిచిన రోహిత్ శర్మ 38 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. స్కోరును వంద పరుగుల మైలురాయిని దాటించిన తర్వాత, ఇక్బాల్ అబ్దుల్లా బౌలింగ్‌లో ఎబి డివిలియర్స్ క్యాచ్ అందుకోగా అవుటైన అతను 44 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 62 పరుగులు సాధించాడు. జొస్ బట్లర్ 14 బంతుల్లో 28 పరుగులు సాధిచి ఇక్బాల్ అబ్దుల్లా బౌలింగ్‌లోనే షేన్ వాట్సన్‌కు చిక్కాడు. ఈ దశలో కీరన్ పోలార్డ్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 19 బంతులు ఎదుర్కొన్న అతను 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 40 పరుగులు సాధించాడు. హార్దిక్ పాండ్య రెండు పరుగులతో క్రీజ్‌లో ఉండగా, మరో 12 బంతులు మిగిలి ఉండగానే ముంబయి నాలుగు వికెట్లకు 141 పరుగులు చేసి, ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.

సంక్షిప్త స్కోర్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 (విరాట్ కోహ్లీ 33ట్రావిస్ హెడ్ 37, జస్‌ప్రీత్ బుమ్రా 3/30).
ముంబయి ఇండియన్స్: 18 ఓవర్లలో 4 వికెట్లకు 171 (రోహిత్ శర్మ 62, కీరన్ పోలార్డ్ నాటౌట్ 40).

ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ ఐపిఎల్‌లో తొలి మ్యాచ్‌ని ముంబయి ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. కెరీర్‌లో అతను 23 టి-20 మ్యాచ్‌లు (22 ఇన్నింగ్స్) ఆడిన అతను 566 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 101 (నాటౌట్). మొదటి ఐపిఎల్ మ్యాచ్ ఆడిన 22 ఏళ్ల హెడ్ 37 పరుగులు సాధించి, ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం.