క్రీడాభూమి

జొకోవిచ్‌కు స్పోర్ట్స్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, ఏప్రిల్ 19: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌ను వరుసగా రెండోసారి స్పోర్ట్స్ అవార్డు దక్కింది. 16వ లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైన అతను ‘ఆస్కార్ ఆఫ్ స్పోర్ట్స్’ అవార్డును స్వీకరించారు. అతనికి ఈ అవార్డు లభించడం వరుసగా రెండోసారి, మొత్తం మీద మూడోసారి. 2012, 2015 సంవత్సరాల్లో ఇదే అవార్డుకు ఎంపికైన జొకోవిచ్ మరోసారి సాకర్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ వంటి పలువురు సెలబ్రిటీల కంటే ఎక్కువ ఓట్లు సంపాదించి అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మెస్సీ పేరు పదోసారి నామినేటైంది. అయితే, సాకర్ ఒక జట్టు మొత్తానికి సంబంధించిన క్రీడ కాబట్టి టెన్నిస్‌లో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన జొకోవిచ్‌కు అవార్డు లభించింది. అతను గత ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. మరో గ్రాండ్ శ్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరాడు. ఈ అద్భుతమైన ఫామ్‌తోనే అతను స్పోర్ట్స్ అవార్డును దక్కించుకున్నాడు.
మహిళల విభాగంలో ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కు అవార్డు లభించింది. అయితే, ఆమె ఇతరత్రా కారణాల వల్ల అవార్డుల ప్రదానోత్సవానికి హాజరుకాలేకపోయింది.
లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు గ్రహీతలు
స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ది ఇయర్: నొవాక్ జొకోవిచ్ (సెర్బియా/ టెన్నిస్), స్పోర్ట్స్‌విమన్ ఆఫ్ ది ఇయర్: సెరెనా విలియమ్స్ (అమెరికా/ టెన్నిస్), స్పోర్ట్స్ టీం ఆఫ్ ది ఇయర్: ఆల్ బ్లాక్స్ (న్యూజిలాండ్/ రగ్బీ), బ్రేక్‌త్రూ ఆఫ్ ది ఇయర్: జోర్డాన్ స్పీత్ (అమెరికా/ గోల్ఫ్), కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్: డాన్ కార్టర్ (న్యూజిలాండ్/ రగ్బీ), స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ది ఇయర్ విత్ ఆ డిసెబిలిటీ: డానియల్ డయాస్ (బ్రెజిల్/ స్విమ్మింగ్), యాక్షన్ స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ది ఇయర్: జాన్ ఫ్రొడెనో (జర్మనీ/ ఐరన్‌మన్ ట్రయాథ్లాన్).

చిత్రం... లారెస్ వరల్డ్ స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్