క్రీడాభూమి

లోధా సిఫార్సుల అమల్లో సమస్యలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న బిసిసిఐకే స్పష్టత అంటూ లేదని సుప్రీం కోర్టు ఈఏడాది జనవరి నాలుగున వ్యాఖ్యానించింది. క్రికెట్ ప్రక్షాళనకు లోధా కమిటీ సూచించిన అంశాలను అమలు చేసినందువల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, న్యాయమూర్తి ఇబ్రహీం కలిఫుల్లాతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ నిలదీసింది. బోర్డు కార్యవర్గంలో మంత్రులకు చోటు కల్పించవద్దని లోధా కమిటీ చేసిన సూచనను అమలు చేయడంలో నష్టం ఏముందని ప్రశ్నించింది. బిసిసిఐ సమర్పించిన గత ఐదేళ్ల కాలంలో సభ్య సంఘాలకు చెల్లించిన మొత్తాల జాబితాను పరిశీలించిన కోర్టు ఈ విషయంలో ఒక స్పష్టమై విధానాన్ని అమలు చేయడం లేదని వ్యాఖ్యానించింది. కోట్ల రూపాయల లావాదేవీలను ఎవరి జోక్యం లేకుండా స్వతంత్రంగా నిర్వహించాలనుకోవడం సమంజసం కాదని పేర్కొంది. విశ్రాంత న్యాయమూర్తి లోధా నేతృత్వంలో, అశోక్ భాన్, ఆర్‌వి రవీంద్రన్ సభ్యులుగా ఉన్న కమిటీ తన నివేదికలో పేర్కొన్న పలు సిఫార్సులను ప్రస్తావించింది. వీటి అమలు అసాధ్యమనడంలో అర్థం లేదని స్పష్టం చేసింది.

నైట్ రైడర్స్ క్యాంప్ షురూ
కోల్‌కతా, ఏప్రిల్ 5: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ సన్నాహాలు మొదలు పెట్టింది. ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం నైట్ రైడర్స్ శిక్షణ శిబిరాన్ని మం గళవారం మొదలుపెట్టింది. కెప్టెన్ గౌతం గంభీర్, హార్డ్ హిట్టర్ యూ సుఫ్ పఠాన్‌సహా పలువురు ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో చెమటోడ్చా రు. 2012లో మొదటిసారి, 2014లో మరోసారి నైట్ రైడర్స్‌కు టైటిల్ అందించిన గంభీర్ ఈసారి కూడా తమ జట్టు గట్టిపోటీనిస్తుందని ధీ మా వ్యక్తం చేస్తున్నాడు. కాగా ఈ జట్టులోని ఉమేష్ యాదవ్, మనీష్ పాండే టీమిండియాలో సభ్యులు. కీలక ఆటగాళ్లు గంభీర్, రాబిన్ ఉ తప్ప తమ చివరి దేశవాళీ మ్యాచ్‌లను ఈ ఏడాది జనవరిలో జరిగిన ముస్తాక్ అలీ టోర్నీలో ఆడారు. కాగా, యూసుఫ్ పఠాన్ గతంలో కం టే సన్నబడ్డాడు. అతను పీయూష్ చావ్లాతో కలిసి చాలాసేపు నెట్స్‌లో బౌలింగ్ కూడా చేశాడు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, న్యూజిలాండ్ స్టార్ కొలిన్ మున్రో ఇంకా జట్టుతో చేరలేదు. ఇటీవలే టి-20 వరల్డ్‌కప్‌ను గెల్చుకున్న విండీస్ జట్టులోని సభ్యులు జాసన్ హోల్డర్, ఆండ్రె రసెల్ త్వరలోనే వచ్చి చేరుతారు.