క్రీడాభూమి

నిరాదరణ బాధిస్తోంది: సమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 4: టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నప్పటికీ, సరైన ఆదరణ లభించకపోవడం తనను బాధిస్తున్నదని వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సమీ అన్నాడు. గ్రెనడా నుంచి ప్రధాని కీత్ మిచెల్ స్వయంగా ఫోన్ చేసి తమను అభినందించాడని, కానీ, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) మాత్రం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈటోర్నీలో అడుగుపెట్టినప్పుడే తమను తెలివిలేని ఆటగాళ్లతో కూడిన జట్టుగా బ్రిటన్‌కు చెందిన కామెంటేటర్ మార్క్ నికోలస్ అభివర్ణించిన విషయాన్ని సమీ గుర్తుచేశాడు. ‘మా క్రికెట్ బోర్డే మమ్మల్ని కించ పరుస్తుంటే, ఎవరైనా.. ఏదైనా అంటారు’ అని వాపోయాడు. అందుకే, తమను విమర్శించిన ప్రతి ఒక్కరికీ ట్రోఫీని కైవసం చేసుకోవడమే సరైన సమాధానమని అన్నాడు. అదే పట్టుదలతో, సమష్టి కృషితో విజయం సాధించామని అన్నాడు. తమ టి-20 వరల్డ్ కప్ ట్రోఫీని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు అంకితమిస్తున్నామని అన్నాడు.
మళ్లీ ఎప్పుడు ఆడతానో?
టి-20 టోర్నమెంట్ మళ్లీ ఎప్పుడు ఆడతానో తెలియదని సమీ అన్నాడు. ఈఏడాది మొత్తంలో విండీస్‌కు టి-20 సిరీస్‌లు లేవని అన్నాడు. టి-20 సిరీస్‌లు ఆడుతూ, డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులను కలుసుకునే అవకాశం ఎప్పుడు లభిస్తుందో అర్థం కావడం లేదన్నాడు. క్రిస్ గేల్, డ్వెయిన్ బ్రేవో, జాసన్ హోల్డర్, కార్లొస్ బ్రాత్‌వెయిట్, సులేమాన్ బెన్ వంటి ఎంతో మంది సమర్థులు జట్టులో ఉన్నారని, వీరంతా ఒంటి చేత్తో విజయాలను సాధించిపెట్టే సమర్థులేనని సమీ చెప్పాడు. తమ జట్టు ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడి లేదని స్పష్టం చేశాడు.
బిసిసిఐ మద్దతు ప్రశంసనీయం: బ్రేవో
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నుంచి తమకు లభిస్తున్న మద్దతు ప్రశంసనీయమని విండీస్ ఆల్‌రౌండర్ డ్వెయిన్ బ్రేవో అన్నాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) తమను ఎన్నడూ గౌరవించలేదని ఆరోపించాడు. క్రీడాకారులను ఎలా ప్రోత్సహించాలి, వారితో ఏ విధంగా వ్యవహరించాలి అన్న విషయాలను బిసిసిఐ నుంచి నేర్చుకోవాలని డబ్ల్యుఐసిబి అధికారులకు సూచించాడు.
సమీ వ్యాఖ్యలు అర్థరహితం!
సెయింట్ జాన్స్: టి-20 వరల్డ్ కప్‌ను గెల్చుకున్నప్పటికీ తమను ఎవరూ పట్టించుకోలేదని, తాము పూర్తిగా నిరాదరణకు గురవుతున్నామని వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సమీ చేసిన వ్యాఖ్యాలను డబ్ల్యుఐసిబి ఖండించింది. ఈ విధంగా అర్థరహితంగా మాట్లాడడం, ఆరోపణలు గుప్పించడం మంచి పద్ధతి కాదని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. సహజంగా ఒక మ్యాచ్ లేదా టోర్నీ గెలిచిన వెంటనే శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీగా వస్తున్నదని, అయితే, ఈసారి కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనని తెలిపింది. ఈ విషయంలో విచారణకు బోర్డు అధ్యక్షుడు డేవ్ కామెరాన్ ఆదేశించినట్టు పేర్కొంది. తాము క్రికెటర్లను గౌరవించడం లేదని సమీ చేసిన వ్యాఖ్యలను ఖండించింది.
చర్చిద్దాం రండి..
సమస్యలపై చర్చిద్దామని క్రికెటర్లను డబ్ల్యుఐసిబి ఆహ్వానించింది. ఎలాంటి సమస్యలకైనా చర్చలే పరిష్కారమని పేర్కొంది. విమర్శలు, ప్రతి విమర్శల వల్ల లాభం ఉండదని స్పష్టం చేసింది. ఆటగాళ్లు భారత్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేసి, సుమస్యలను చర్చిస్తామని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
సామ్యూల్స్‌కు జరిమానా
ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన టి-20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆడుతున్నప్పుడు అసభ్య పదజాలాన్ని ఉపయోగించిన వెస్టిండీస్ క్రికెటర్ మార్లొన్ సామ్యూల్స్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతాన్ని జరిమానాగా విధించింది. ఇంగ్లాండ్ బౌలర్ బెన్ స్టోక్స్‌ను ఉద్దేశించి సామ్యూల్స్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్టు ఐసిసికి మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే ఫిర్యాదు చేశాడు. సామ్యూల్స్ పొరపాటు చేశానని అంగీకరించడంతో, మొదటి స్థాయి నేరంగా పరిగణించిన ఐసిసి అతనికి జరిమానా విధించింది. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

చిత్రం టి-20 వరల్డ్ కప్‌తో విండీస్ కెప్టెన్ సమీ