క్రీడాభూమి

ఐసిసి టి-20 జట్టుకు కెప్టెన్‌గా కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 4: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన టి-20 జట్టుకు భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆదివారం ముగిసిన టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్) 295 పరుగులు సాధించగా, కోహ్లీ 273 పరుగులతో టాప్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. భారత్ నుంచి వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాకు కూడా ఈ జట్టులో స్థానం దక్కింది. క్రీడాకారులు ప్రదర్శించిన ప్రతిభాపాటవాల ఆధారంగా ఐసిసి పురుషులు, మహిళల విభాగాల్లో జట్లను ప్రకటించింది. మహిళల జట్టుకు స్ట్ఫానీ టేలర్ (వెస్టిండీస్)ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ విభాగంలో భారత్ నుంచి ఎవరికీ స్థానం దక్కలేదు.
ఐసిసి టి-20 పురుషుల జట్టు: విరాట్ కోహ్లీ (్భరత్/ కెప్టెన్), జాసన్ రాయ్ (ఇంగ్లాండ్), క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా/ వికెట్‌కీపర్), జో రూట్ (ఇంగ్లాండ్), జొస్ బట్లర్ (ఇంగ్లాండ్), షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా), ఆండ్రె రసెల్ (వెస్టిండీస్), మిచెల్ సాంట్నర్ (న్యూజిలాండ్), డేవిడ్ విల్లే (ఇంగ్లాండ్), సామ్యూల్ బద్రీ (వెస్టిండీస్), ఆశిష్ నెహ్రా (్భరత్). 12వ ఆటగాడు ముస్త్ఫాజుర్ రహ్మాన్ (బంగ్లాదేశ్).
ఐసిసి మహిళల టి-20 జట్టు: స్ట్ఫానీ టేలర్ (వెస్టిండీస్/ కెప్టెన్), సూజీ బేట్స్ (న్యూజిలాండ్), చార్లొట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్), మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), సోఫీ డివైన్ (న్యూజిలాండ్), రాచెల్ ప్రీస్ట్ (న్యూజిలండ్/ వికెట్‌కీపర్), దియేంద్ర డోటిన్ (వెస్టిండీస్), మెగాన్ షట్ (ఆస్ట్రేలియా), సనే లస్ (దక్షిణాఫ్రికా), లీ కాస్పెరెక్ (న్యూజిలాండ్), అన్య షబ్‌స్రోల్ (ఇంగ్లాండ్). 12వ క్రీడాకారిణి: అనామ్ అమీన్ (పాకిస్తాన్).